Site icon NTV Telugu

Manchu Vishnu : ఉత్తరాది కలెక్షన్లను గౌరవించాలంటున్న మంచు విష్ణు

Manchu Vishnu

Manchu Vishnu

Manchu Vishnu : మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు మంచు విష్ణు, మోహన్ బాబు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడారు. ‘నార్త్ ఇండియా నుంచి వస్తున్న కలెక్షన్లను తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే మనకు ఆ కలెక్షన్లు చాలా ముఖ్యం. కాబట్టి నార్త్ ఇండియా నుంచి మన తెలుగు సినిమాలకు వస్తున్న కలెక్షన్లను గౌరవించాలి. నార్త్ ప్రేక్షకులు మన సినిమాలపై ప్రేమ కురిపిస్తున్నారు. అందుకే మన సినిమాలకు అన్ని ప్రాంతాలు ముఖ్యం’ అంటూ తెలిపారు.
Read Also : Blue Drum: పెళ్లిలో వరుడికి గిఫ్ట్‌గా ‘‘బ్లూ డ్రమ్’’.. ఒక్కసారిగా అంతా షాక్..

‘ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దక్షిణ, నార్త్ అనే బేధంలో చూడరు. సినిమాలో వారిని కేవలం నటుడిగా మాత్రమే చూస్తున్నారు. మన సౌత్ సినిమాల కథలు మూలాల నుంచి వస్తున్నాయి. మట్టి నుంచి పుడుతున్నాయి. అందుకే అవి నార్త్ వారికి బాగా నచ్చుతున్నాయి. నేను కూడా అలాంటి కథలతోనే సినిమాలు చేయడాన్ని ఇష్టపడతాను. త్వరలోనే బాలీవుడ్ యాక్టర్ తో సినిమా చేయబోతున్నాను. అది 1940 దశకంలోని కథ. దానిపై త్వరలోనే అప్డేట్ ఇస్తాను. కన్నప్ప సినిమాను అందరూ ఆదరించాలి’ అంటూ కోరారు.

Exit mobile version