Site icon NTV Telugu

Kannappa : కన్నప్పపై కుట్రలు ఆపండి.. మంచు విష్ణు వార్నింగ్..

Manchu Vishnu

Manchu Vishnu

Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. చాలా కాలం తర్వాత విష్ణుకు మంచి హిట్ పడింది. ఈ మూవీపై ట్రోల్స్ కూడా మునుపట్లాగా రావట్లేదు. మూవీ టీజర్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా కథ బలంగా ఉండటంతో పాటు విష్ణు నటనకు ప్రశంసలు రావడంతో ట్రోల్స్ ఆపేశారు. తాజాగా విష్ణు మూవీకి ఎదురవుతున్న సమస్యను బయట పెట్టేశాడు. అది కాస్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. కన్నప్ప సినిమాపై కుట్ర జరుగుతోందని సంచలనం రేపాడు విష్ణు. మూవీని పైరసీ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వాపోయాడు.

read also : Rashmika : ఆ నీచమైన పని చేయను.. రష్మిక షాకింగ్ ఆన్సర్..

ఈ మేరకు ఎక్స్ లో ఎమోషనల్ ట్వీట్ చేశాడు. మేం కన్నప్ప మూవీని ఎంతో కష్టపడి నిర్మించాం. దయచేసి దాన్ని పైరసీ చేయకండి. కన్నప్ప మూవీని అనధికారికంగా పైరసీ చేసిన 30వేలకు పైగా లింకులను మా టీమ్ తొలగించింది. ఇంకా వస్తూనే ఉన్నాయి. వాటిని కూడా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేం ఎంతో కష్టపడ్డాం. ఇలా పైరసీ చేయడం కూడా దొంగతనమే అవుతుంది. మన ఇంట్లో పిల్లలను దొంగతనం చేయమని చెబుతామా.. ఇలా పైరసీ చేయడం దొంగతనం కిందకే వస్తుంది. కన్నప్పను పైరసీ చేయొద్దు. థియేటర్లలో చూసి ఆదరించండి. కన్నప్ప లాంటి గొప్ప కథను థియేటర్లలో చూసి ఆదరించండి’ అంటూ తెలిపాడు మంచు విష్ణు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

read also : Tollywood : 9 హిట్లు.. 2025 హాఫ్‌ ఇయర్ విన్నర్ ఆ హీరోనే..!

Exit mobile version