Manchu Vishnu : సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలను ఇక సహించం.. మంచు విష్ణు వార్నింగ్
- సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలను ఇక సహించం
- మంచు విష్ణు వార్నింగ్
- తెలుగు వాళ్లంటే చాలా పద్ధతిగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా అనుకుంటూ ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: గత కొద్దిరోజులుగా ప్రణీత్ హనుమంతు వ్యవహారం సోషల్ మీడియాలోనే కాదు టాలీవుడ్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈరోజు సాయంత్రం అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అయితే ఈ అంశం మీద తాజాగా స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తెలుగు వాళ్లంటే చాలా పద్ధతిగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా అనుకుంటూ ఉంటారు. కానీ తెలుగు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ వల్ల మిగతా వాళ్ళందరూ ఇలా తయారయ్యారేంటి అని తెలుగు వాళ్ళందరినీ అనుకునే పరిస్థితి ఏర్పడిందని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్ వీడియో మీద స్పందించిన రేవంత్ రెడ్డి సహా మిగతా ప్రభుత్వ పెద్దలందరికీ చాలా థాంక్స్ చెబుతున్నాను. నిజానికి ప్రణీత్ హనుమంతు కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.
Also Read: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
అతను ఎందుకు దీన్ని కామెడీ చేసి ఆనందపడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చేసి పోస్ట్ చేసే వాళ్ల మీద సైబర్ సెక్యూరిటీ సెల్ కి ఫిర్యాదు చేస్తామని ఇకనుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరు మార్చుకోవాలని మంచు విష్ణు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా మంచు విష్ణు కోరారు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం సరికాదు, తెలంగాణ సీఎం రేవంత్ -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసినా, డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ పెద్దలను కోరారు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!