NTV Telugu Site icon

Manchu Vishnu : సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలను ఇక సహించం.. మంచు విష్ణు వార్నింగ్

Mv

Mv

Manchu Vishnu: గత కొద్దిరోజులుగా ప్రణీత్ హనుమంతు వ్యవహారం సోషల్ మీడియాలోనే కాదు టాలీవుడ్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈరోజు సాయంత్రం అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అయితే ఈ అంశం మీద తాజాగా స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తెలుగు వాళ్లంటే చాలా పద్ధతిగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా అనుకుంటూ ఉంటారు. కానీ తెలుగు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ వల్ల మిగతా వాళ్ళందరూ ఇలా తయారయ్యారేంటి అని తెలుగు వాళ్ళందరినీ అనుకునే పరిస్థితి ఏర్పడిందని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. సాయిధరమ్ తేజ్ వీడియో మీద స్పందించిన రేవంత్ రెడ్డి సహా మిగతా ప్రభుత్వ పెద్దలందరికీ చాలా థాంక్స్ చెబుతున్నాను. నిజానికి ప్రణీత్ హనుమంతు కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.

Also Read: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!

అతను ఎందుకు దీన్ని కామెడీ చేసి ఆనందపడుతున్నారు అనేది  నాకు అర్థం కాలేదు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చేసి పోస్ట్ చేసే వాళ్ల మీద సైబర్ సెక్యూరిటీ సెల్ కి ఫిర్యాదు చేస్తామని ఇకనుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరు మార్చుకోవాలని మంచు విష్ణు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా మంచు విష్ణు కోరారు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం సరికాదు, తెలంగాణ సీఎం రేవంత్ -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసినా, డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ పెద్దలను కోరారు.