NTV Telugu Site icon

Bhakta Kannappa: న్యూజీలాండ్ లో ప్రభాస్ vs మంచు విష్ణు.. మాస్ యాక్షన్ ఎపిసోడ్ లోడింగ్

Manchu Vishnu Vs Prabhas

Manchu Vishnu Vs Prabhas

Manchu Vishnu Vs Prabhas in Bhakta Kannappa: మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మంచు విష్ణు అనే కాదు మంచు కుటుంబం మొత్తం సాలిడ్ హిట్ కోసం తపిస్తున్నారు. నిజానికి మోహన్ బాబు బిరుదే కలెక్షన్ కింగ్, అలాంటి ఆయన సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాతో భారీ షాక్ తిని సినిమాల నుంచి కొంచెం దూరం అయ్యారు. ఆ తరువాత మంచు విష్ణు ఎన్నో ఆశలతో జిన్నా అనే సినిమా చేసినా ఆ సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకున్నారు. ఇక ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఆయన భక్త కనప్ప అనే ప్రాజెక్టు చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..

మంచు విష్ణు కన్నప్పగా కనిపించనున్న ఈ సినిమాలో ప్రభాస్ మాహాశివుడిగా కనిపిస్తుండగా ఆయన భార్య అయిన పార్వతి పాత్రలో నయనతార నటిస్తుందని అంటున్నారు. ఇక మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని చెబుతుండగా శివ రాజ్ కుమార్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అదలా ఉంచితే ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేమంటే ఈ సినిమాలో శివుడైన ప్రభాస్ కు, శివ భక్తుడైన కన్నప్ప పాత్రధారి మంచు విష్ణుతో ఒక భీకరమైన యుద్ధం ఎపిసోడ్ ఉంటుంది, ఈ యాక్షన్ బ్లాక్ సినిమా మొత్తానికి హైలైట్ అని అంటున్నారు. ఈ సినిమా మొత్తం మీద ఈ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. తన భక్తుడి భక్తి మెచ్చి దాన్ని పరీక్షించేందుకు ఇలా తలపడడతాడని అంటున్నారు.

Show comments