NTV Telugu Site icon

Manchu Vishnu: మోసం చేశాడు.. ప్రభాస్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

Prabhas

Prabhas

Manchu Vishnu: మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విష్ణు సినిమా గురించి ఆసక్తి విషయాలను పంచుకుంటూనే వేరే హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో విష్ణు ప్రభాస్ గురుంచి ఆదిపురుష్ టీజర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

“నేను ఒక తెలుగు వ్యక్తి మీద నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. లైవ్, యాక్షన్ గా రామాయణాన్ని తెరకెక్కిస్తారని మేము అనుకున్నాం. కానీ, టీజర్ చూశాక యానిమేషన్ సినిమాను రూపొందించారని అర్ధమయ్యింది. సినిమా తీసే ముందే అభిమానులకు యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే జీరో ట్రోల్స్ వచ్చేవి.. కానీ ప్రేక్షకులు మోసం చేసి రిలీజ్ చేస్తే ఇలాగే స్పందిస్తారు. తానాజీ సినిమాకు దర్శకత్వం వహించిన ఓం రౌత్, ప్రభాస్ తో రామాయణం తెరకెక్కించాడు. దీంతో సినిమాపై చాలా ఉహించుకున్నాం. ప్రేక్షకులు నాకన్నా ఎక్కువ ఊహించుకున్నారు. అయితే అది మిస్ ఫైర్ అయ్యి ట్రోల్స్ వస్తున్నాయి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక హారర్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాతో విష్ణు విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

Show comments