Site icon NTV Telugu

టికెట్ సమస్య వాళ్లు చూసుకుంటారు.. నేను మాట్లడను- ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు

manchu vishnu

manchu vishnu

ఎన్నో రసవత్తరమైన పరిస్థితుల నడుమ ‘మా’ ప్రెసిడెంట్ గా గెలిచారు మంచు విష్ణు. పదవి భాద్యతలు చేపట్టిన దగ్గరనుంచి మౌనంగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. త్వరలోనే ‘మా’ బిల్డింగ్ ని నిర్మించే పనిలో ఉన్నారు విష్ణు. ఇక ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రెసిడెంట్ గా గెలిచి 100 రోజులు కావడంతో ఆయన్ను అభినందిస్తూ ఒక వెబ్ పోర్టల్.. విష్ణు ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ ఇంటర్వ్యూ లో విష్ణు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించడంపై టాలీవుడ్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై పలువురు స్టార్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఒక మా ప్రెసిడెంట్ అయ్యి ఉండి, అందులోను నిర్మాత గా ఉన్న విష్ణు ఒక్కసారి కూడా స్పందించకపోవడంపై విమర్శలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. మీమ్స్ రూపంలో చాలామంది విష్ణును ట్రోల్ కూడా చేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో మొదటిసారి టికెట్ రేట్స్ ఇష్యూపై ప్రెసిడెంట్ విష్ణు స్పందించారు. ” ఇండస్ట్రీలో టికెట్ రేట్ల సమస్యపై పెద్దలే పరిష్కారం వెతుకుతున్నారు.. ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడకూడదని, వారు సమస్యను పరిష్కరిస్తారనే నమ్మకంతోనే నేను మౌనంగా ఉన్నాను. టికెట్ ధరల అంశంలో కొందరు ఛాంబర్ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, అందుకే ఎవరుపడితే వాళ్ళు మాట్లాడి ఈ సమస్యను ఇంకా పెంచాలనుకోవడంలేదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విష్ణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కొంతమంది విష్ణుది సరైన నిర్ణయం అంటుండగా.. మరికొందరు పదవిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడంలో తప్పలేదు.. ఇలా మౌనంగా ఉండడం పద్దతికాదని విమర్శిస్తున్నారు.

Exit mobile version