Manchu Vishnu Planning Movie With Prabhudeva: మంచు ఫ్యామిలీలోని నటీనటులు జయాపజయాలతో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాల్ని చేస్తున్నారు. రీసెంట్‌గా మంచు విష్ణు ‘జిన్నా’తో పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే! అయితే.. ఆ రిజల్ట్‌ని పట్టించుకోకుండా, మరో సినిమా చేసేందుకు అతడు మాస్టర్ ప్లాన్ వేశాడని సమాచారం. ఈసారి మంచు విష్ణు ఓ స్టార్ కొరియోగ్రాఫర్‌ని రంగంలోకి దింపబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. ప్రభుదేవా!
ప్రభుదేవా డైరెక్టర్‌గా కొన్ని సినిమాలు తీసిన సంగతి అందరికీ తెలిసిందే! నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తిన ఆయన.. మెగాస్టార్ చిరంజీవితో శంకర్‌దాదా జిందాబాద్ చేశారు. అటు బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గణ్, షాహిద్ కపూర్‌లతోనూ పెద్ద ప్రాజెక్టులు రూపొందించాడు. చివరగా సల్మాన్‌తో ‘రాధే’ సినిమా తీశాడు. ఆ తర్వాత మెగాఫోన్ పట్టలేదు. కొరియోగ్రాఫ్ చేసుకుంటూ, తన కెరీర్‌ని ముందుకు నడుపుతున్నాడు. జిన్నా సినిమాలోని ‘గోలీసోడ’ పాటని సైతం ఈయనే కొరియోగ్రాఫర్ చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సినిమా చర్చలు జరిగాయని వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ప్రభుదేవా దర్శకుడిగా ఏ సినిమా చేయడం లేదు. అటు మంచు విష్ణు కూడా ఒక పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. తమ కాంబోలో ఓ సినిమా చేస్తే బాగుంటుందని, ఇద్దరు మాట్లాడుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అది కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారట! అన్నీ అనుకున్నట్టు కుదిరితే.. వీరి కాంబోలో ఓ సినిమా తప్పకుండా ఉండొచ్చని అంటున్నారు.
