Site icon NTV Telugu

ఎస్పీ బాలు ‘మా’ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం

Manchu Vishnu Panel Oath Ceremony launch

యంగ్ హీరో మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే అక్టోబర్ 16 న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైందిముందుగా ఫిల్మ్ నగర్ గుడిలో పూజలు ముగించుకుని, కల్చరల్ సెంటర్ లో వేడుక జరుగుతున్న వేదిక దగ్గరకు బ్యాండ్ మేళాలతో వచ్చారు.

Read Also : శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై హీరోయిన్ ఫిర్యాదు… కేసు నమోదు

ట్రెజరరీగా ఎన్నికైన శివబాలాజీ భార్య మధుమిత ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేశారు. ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, డిఆర్సీ మోహన్ బాబు, ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, మంచు విష్ణు, తదితరులతో పాటు మంచు ఫ్యామిలీ కూడా వచ్చారు. మంచు విష్ణు పిల్లలు, ఆయన భార్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పెద్దలంతా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ‘మా’కు జాతీయ గీతంగా భావించే ఎస్పీ బాలు ‘మా’ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం చేశారు. ఈ పాటను దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు పాడగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Exit mobile version