Kannappa : ఒక సినిమా గురించి ఎంత వరకు చెప్పాలో అంతే చెబితే బెటర్. దాని స్థాయికి మించి ఓవర్ గా చెబితే ప్రేక్షకులు ఆ స్థాయిలోనే ఊహించుకుంటారు. తీరా మూవీ ప్రేక్షకుల ఊహకు తగ్గట్టు లేకపోతే అది బెడిసికొడుతుంది. సినిమా బాగున్నా సరే చెప్పిన స్థాయిలో లేకపోయినా నెగెటివ్ టాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాలు మంచు విష్ణుకు తెలియనివి కావు. రాజమౌళి కూడా తన సినిమాలకు ఈ స్థాయి బిల్డప్ లు అసలే ఇవ్వడు. తన సినిమా ఎలాంటిదో మాత్రమే చెబుతాడు.
Read Also : Balakrishna : టాలీవుడ్ లో ఆ అరుదైన రికార్డు బాలయ్యదే..
ఎందుకంటే సినిమాలో ఉన్నదానికంటే ఎక్కువ చెబితే ప్రేక్షకుల్లో స్థాయికి మించి అంచనాలు పెరుగుతాయి. సినిమా బాగున్నా సరే ఊహించుకున్నంత లేదు కదా అని వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. అందుకే సినిమా గురించి ఎంత వరకు చెప్పాలో అంతే చెప్పాలి. విష్ణు మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్లలో భారీ హైప్ ఇచ్చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని.. మోహన్ లాల్ పాత్ర చూస్తే మామూలుగా ఉండదని అంటున్నారు. కన్నప్ప మూవీ రిలీజ్ కు ముందే సక్సెస్ ర్యాలీలు తీసేస్తున్నారు.
పైగా ఓటీటీ సంస్థకు రిలీజ్ అయి హిట్ అయిన తర్వాతే చెక్ రెడీ చేసుకోమన్నాను అంటున్నాడు. కన్నప్ప కోసం వందల కోట్ల బడ్జెట్ అయిందని.. ఆ లెక్కలు చెబితే తన ఇంటి ముందు ఐటీ వాళ్లు క్యూ కడుతారంటున్నాడు. సినిమాలో వీఎఫ్ ఎక్స్ భారీగా వాడామని.. ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుందని.. ఒకటా రెండా.. ఏవేవో చెప్పేస్తున్నాడు.
విష్ణు మాటలు వింటున్న వారు మూవీపై అంచనాలు బాగానే పెంచేసుకుంటున్నాడు. అది మరీ ఎక్కువ అయితే రేపు మూవీ చూడటానికి బాగున్నా.. అనుకున్నంత లేకపోతే కష్టమే. అంచనాలను అందుకోలేక ప్లాప్ అయిన మంచి సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. కాబట్టి అవసరానికి మించి మూవీ గురించి చెబితే నష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. విష్ణు ఏ కాన్ఫిడెన్స్ తో ఇవన్నీ చెబుతున్నాడో అర్థం కావట్లేదు. నిజంగానే విష్ణు చెప్పినట్టు మూవీ ఆ స్థాయిలో ఉంటే తిరుగులేనట్టే. ఏ మాత్రం తేడా కొట్టినా మామూలుగా అయ్యే డ్యామేజ్ కంటే విష్ణు ఓవర్ హైప్ వల్ల అయ్యే డ్యామేజే ఎక్కువగా ఉంటుంది.
Read Also : ‘Akhanda 2’ vs ‘OG’ : ఇది జరిగేట్టు లేదే!
