‘మా’ ఎన్నికల అధికారిగా గెలిచిన మంచు విష్ణు ఇప్పటికే పదవీ బాధ్యతలను చేపట్టారు. ‘మా’ అధ్యక్షుడిగా ఆయన మొదటి సంతకం ఆగిపోయిన పెన్షన్స్ ఫైల్ పై చేశారు. ఇక తనను గెలిపించిన వారికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపిన విష్ణు ఇప్పుడు స్వయంగా అందరీ ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్ వంటి వారిని కలిసిన మంచు విష్ణు త్వరలోనే చిరంజీవిని కూడా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటానని వెల్లడించారు. ఈరోజు ఉదయమే తన తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు బాలయ్యను ఆయన నివాసంలో కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
Read Also : ‘మా’ ఎన్నికల అధికారిని సీసీటీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్ రాజ్
ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంచు విష్ణు మంత్రిని ఆహ్వానించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మంచు విష్ణు, ట్రెజరర్ శివ బాలాజీ తలసానితో కలిసి ఫోటో దిగారు. మరోవైపు ప్రకాష్ రాజ్ కార్యవర్గం రాజీనామా చేయడమే కాకుండా తాజాగా ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఎన్నికలు జరిగిన సమయంలో రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ కావాలని కోరుతూ లేఖ రాశారు. ‘మా’లో నెక్స్ట్ ఏం జరగబోతోంది ? అన్నది ఆసక్తికరంగా మారింది.
