NTV Telugu Site icon

Manchu Vishnu: టాలీవుడ్‌లో నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..

Manchu Vishnu

Manchu Vishnu

ఇండస్ట్రీ ఏదైనప్పటికి నెపోటిజం అనే పదం కొన్ని దశాబ్దాల కాలం నుంచి వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికి చాలా మంది హీరోలు హీరోయిన్‌లు చాలా రకాలగా స్పందించారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ఈ నెపోటిజం పై స్పందించాడు. ఇండస్ట్రీలో బంధుత్వం అనేది కేవలం మొదటి సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..

విష్ణు మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనే విషయాన్ని అంగీకరిస్తాను. కానీ టాలెంట్ ఉంటేనే జనాలు ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే ఇండస్ట్రీలో నిలబడడం కష్టం. చాలా మంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో రావడం ఈజీ అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయం విన్నప్పుడల్లా నాకు చాలా నవ్విస్తుంది. మన కష్టం మీద మన కెరీర్ ఆధారపడి ఉంటుంది.నా మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా నాలో ఏదో టాలెంట్ ఉందని ఆడియన్స్ గుర్తించారు.అందుకే నన్ను హీరోగా యాక్సెప్ట్ చేశారు. అందువల్ల ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగా గలుగుతున్నాను’ అని తెలిపారు.ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

ఇక పోతే ఒకవైపు మంచు మనోజ్, మోహన్ బాబు వరుసగా పోలీస్ స్టేషన్‌లు, కంప్లైంట్ అంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటే. మంచు విష్ణు మాత్రం ఇవేవీ పట్టీపట్టనట్లు, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అందులో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు. ఈ మూవీలో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు. మరి ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి.