Site icon NTV Telugu

Manchu Vishnu: ఆ 18 మందిని వదిలే ప్రసక్తే లేదు.. ‘మా’ ప్రెసిడెంట్ వార్నింగ్

Vishnu

Vishnu

Manchu Vishnu: మా ప్రెసిడెంట్ మంచు విష్ణు యూట్యూబర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన 18 మంది యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసు వేసి వారి ఛానెల్స్ ను బ్యాన్ చేయిస్తానని చెప్పుకొచ్చాడు. మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు సరసన సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 21 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచిన విష్ణు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఇక ఈ వేదికపై మంచు విష్ణు మాట్లాడుతూ.. మా ఎలక్షన్స్ అప్పుడు తనను, తన కుటుంబాన్ని ఎంతో మంది ట్రోల్స్ చేశారని, వారెవ్వరిని వదలమని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తమ కుటుంబాన్ని ట్రోల్స్ తో వేధించిన 18 మంచి యూట్యూబ్ ఛానెళ్ళపై కేసు పెట్టనున్నానని, వారు వలన తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చాడు.

ఇక అలాంటి యూట్యూబ్ ఛానెల్స్ ను వెతికి మరీ బ్యాన్ చేస్తామని చెప్పిన విష్ణు.. ట్రోల్స్ విషయంలో మా ప్రెసిడెంట్ గా కూడా యాక్షన్ తీసుకోనున్నట్లు చెప్పాడు. కొన్నిరోజులుగా సినిమా తారలను చనిపోయినట్లు చూపిస్తున్నారని, అందరికి కుటుంబాలు ఉంటాయి.. వారు ఆ వార్తలు చూసి మాకే కాల్ చేస్తున్నారు. ఇక నుంచి ఇలాంటివి కనుక వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. రూమర్స్, హీరో హీరోయిన్ల మధ్య గాసిప్స్ రావడం సహజమే.. అలాంటివి రాసుకోండి.. కానీ ఇలా బతికున్నవారిని చంపేలాంటివి మానుకోండి అని చెప్పుకొచ్చాడు. తనను, తన సినిమాను ఎంతైనా ట్రోల్ చేయండి కానీ తన కుటుంబం జోలికి వస్తే ఊరుకొనేది లేదని చెప్పుకొచ్చాడు. ట్రోల్స్ అందరిని నవ్వించేవిగా ఉండాలి కానీ ఇలా ఎదుటివారు బాధపడేలా ఉండకూడదని చెప్పుకొచ్చాడు.

Exit mobile version