Site icon NTV Telugu

Manchu Vishnu : వాడిని తీసుకోవడమే నేను చేసిన తప్పు.. మంచు విష్ణు కామెంట్స్..

Vishnu

Vishnu

Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విష్ణు తరచూ ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన నిర్మాత భరద్వాజతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో అనేక విషయాలపై విష్ణు స్పందించారు. ‘కన్నప్ప సినిమాను గత పదేళ్ల నుంచి మోస్తున్నాను. ఎన్నో రీసెర్చ్ లు చేశాం. వాటన్నింటి తర్వాత దాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాను. అప్పటి నుంచి ప్రతి సీన్ గురించి ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నాం. చరిత్రను మిస్ కాకుండా చేయాలన్నదే ప్లాన్. ఈ మూవీలో నాన్న గారి సలహాలు ఎక్కువగా తీసుకున్నాను. ఆయన సలహా వల్లే మహాభారతం డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ ను తీసుకున్నాం.

Read Also : Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీ పూర్తి.. 20 కేజీలు తగ్గారని భార్య వెల్లడి..!

ఈ మూవీలో ప్రభాస్ చేసిన రుద్ర పాత్ర అద్భుతంగా ఉటుంది. ఆయన కెరీర్ లో మైలురాయిలా ఉండిపోతుంది. ప్రభాస్, మా నాన్న మోహన్ బాబు మధ్య ఓ సీన్ ఉంటుంది. అది మామూలుగా ఉండదు. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ కోసం పూర్తి స్థాయి పరిణతి లేని ఓ వ్యక్తిని తీసుకున్నాం. అదే నేను చేసిన అతిపెద్ద తప్పు. అందువల్లే మూవీ ఇంత ఆలస్యం అయింది. చివరకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ఇప్పటి వరకు అలాంటి తప్పులు నేను చేయలేదు. కానీ ఈ మూవీ విషయంలో జరిగింది. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి. మూవీకి ఎలాంటి ఆటంకాలు లేవు. ఆ శివుడి ఆజ్ఞ ప్రకారం అన్నీ సర్దుకున్నాయి అన్నారు’ విష్ణు. చివర్లో నిర్మాత భరద్వాజ మాట్లాడుతూ కుటుంబ గొడవలు బాధాకరం అని.. వాటిని చర్చింకోవాలని అవసరం అయితే తాను పెద్దరికం తీసుకుంటానన్నారు. దానిపై విష్ణు సానుకూలంగా స్పందించారు. మీ సూచనలు తప్పకుండా పాటిస్తానని చెప్పారు.

Read Also : HHVM : థియేటర్ల బంద్ ఇష్యూ.. ‘వీరమల్లు’కు మేలు చేసిందా..?

Exit mobile version