Site icon NTV Telugu

Ginna: కూతుళ్ళ గురించి మనసులో మాట చెప్పిన మంచు విష్ణు!

Ginna

Ginna

Manchu Vishnu Daughters Own Banner:

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కుటుంబం సినిమా రంగానికి తమ జీవితాలను అంకితం చేసింది. ఆయన కొడుకులు విష్ణు, మనోజ్ తో పాటు కూతురు లక్ష్మీ సైతం నటిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు మూడో తరం కూడా అదే బాటలో సాగబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు తెలిపారు. ఇప్పటికే ఆయన కుమార్తెలు అరియానా, వివియాన సొంత బ్యానర్ లోని చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ కవలలు తెర మీద కూడా కనిపించబోతున్నారు. వీరిద్దరూ కలిసి మంచు విష్ణు తాజా చిత్రం ‘జిన్నా’లో ఓ పాటను పాడారు. అంతేకాదు…

 

ఆ పాటకు నటించారు కూడా! ఈ విషయాన్ని మంచు విష్ణు చెబుతూ, ”ఈ సినిమాలోని ఫ్రెండ్ షిప్ సాంగ్ ను తన కూతుళ్ళు ఇద్దరు కలిసి పాడటంతో పాటు అభినయించారని, దానిని ఈ నెల 24, ఆదివారం ఉదయం 11.13 నిమిషాలకు ఆవిష్కరించ బోతున్నట్టు తెలిపారు. వారు చిత్రసీమలోనే కొనసాగాలన్నది తన కోరికని, అయితే పెద్దయిన తర్వాత వారి మనసుకు నచ్చినట్టు చేసే స్వేచ్ఛను తాను ఇస్తానని విష్ణు అన్నారు. ‘జిన్నా’ సినిమా ఇషాన్ సూర్య దర్శకత్వంలో డాక్టర్ ఎం. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. దీనికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చారు.

Exit mobile version