Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అనేక విషయాలను బటయపెడుతున్నాడు. టాలీవుడ్ హీరోలకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉందనే విషయం తెలిసిందే. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తాను ఎన్నడో బయటకు వచ్చేసానని మంచు విష్ణు తాజాగా బయటపెట్టాడు. ఆ వాట్సాప్ గ్రూప్ ను రానా, అల్లు అర్జున్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నేను అందులో యాక్టివ్ గా ఉండేవాడిని. ఆ గ్రూప్ లో టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ ఉండేవారు.
Read Also : Shyamali De : సమంత-రాజ్ డేటింగ్ రూమర్లు.. డైరెక్టర్ భార్య షాకింగ్ పోస్ట్
మధ్యలో హీరోయిన్లను కూడా ఆడ్ చేశారు. ఆ తర్వాత గ్రూప్ లో మెసేజ్ చేయాలంటే నాకు బిడియంగా అనిపించేది. అందుకే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయమని బన్నీ, రానాకు చెప్పాను. మేమందరం చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. ప్రతి విషయాన్ని అందరం కలిసి చర్చించుకుంటాం.
ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటాం. చిన్నప్పటి నుంచే మా ఫ్రెండ్స్ మమ్మల్ని అలా పెంచారు. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం. కన్నప్ప సినిమాకు హీరోలందరూ విషెస్ చెబుతున్నారు. మూవీ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. రిలీజ్ అయ్యాక చాలా విషయాలు మాట్లాడుతాను అంటూ చెబుతున్నాడు విష్ణు.
Read Also : Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!
