NTV Telugu Site icon

Manchu Mohan Babu: చిరంజీవితో గొడవలు.. ఎట్టకేలకు నోరువిప్పిన మోహన్ బాబు

Chiru

Chiru

Manchu Mohan Babu: కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నేడు తన 71 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం మోహన్ బాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. వ్యక్తిగత విషయాలతో పాటు చిరంజీవితో ఆయనకున్న గొడవల గురించి కూడా నోరు విప్పారు. ” నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా, విలన్ గా, హీరోగా, నటుడిగా, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఎదిగాను. దానికి కారణం నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులు. నేను పడిన కష్టాలు పగవాడు కూడా పడకూడదని కోరుకుంటాను. నేను సంపాదించినవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు, స్థలాలు అన్ని అమ్మేశాను. వాటిని తిరిగి సాధిస్తాను అనుకున్నాను.. అలాగే సాధించాను. ఇల్లే కాదు ఒక యూనివర్సిటీనే స్థాపించాను.

ఇక సినిమాల విషయాలకొస్తే.. నా కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలను నా బ్యానర్ అయిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లో తీసాను. అందులోనే సన్నాఫ్ ఇండియా తీశాను. అదొక ప్రయోగం. ఇక జిన్నా సినిమా విష్ణు కెరీర్ లోనే అద్భుతమైన సినిమా. అది ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలియదు. హీరోగానే కాదు ఎలాంటి పాత్రలు వెయ్యడానికి అయినా సిగ్గుపడను. ఇక నాకు, చిరంజీవికు మధ్య గొడవలు ఉన్నాయి. అయినా మేము ఇద్దరం మాట్లాడుకుంటాం.. ఎదురెదురు పడినప్పుడు పలకరించుకుంటాం. మా ఇద్దరి గొడవలు భార్యాభర్తల లాంటివి. ఎంత పోట్లాడుకున్నా మళ్లీ కలిసిపోతూ ఉంటాం. ఇక నేను ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేను. ఎన్టీఆర్, కృష్ణ మరణించనప్పుడు, ఈ మధ్య జరిగిన మనోజ్ పెళ్ళిలో కూడా ఏడ్చేశా. మా మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వస్తాయి. వాటిని నేనెప్పుడు పట్టించుకోలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments