NTV Telugu Site icon

Manchu Manoj: నా భార్య గర్భవతే కానీ.. ఆ వార్తలు నమ్మొద్దు.. మంచు మనోజ్ లేఖ!

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj Writes a Letter to his Fans: మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఆమె త్వరలో తల్లవబోతున్న నేపథ్యంలో మంచు మనోజ్ తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ రాసిన లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులకు శ్రేయోభిలాషులకు నమస్కారం, అనుక్షణం మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అని చెబుతూ ఒక శుభవార్త అని పేర్కొన్నారు.: నా సతీమణి ప్రస్తుతం ఏడవ నెల గర్భవతి. భగవంతుని ఆశీస్సులతో ఈ క్షణం వరకు తను ఆరోగ్యంగా సురక్షితంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురుచూస్తున్నాం అయితే ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను, అదేమంటే కవల పిల్లలు విషయంలో బయట వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదు.

CM Jagan: వారి ఖాతాల్లోకి ఏకంగా 161.81 కోట్లు జమ చేసిన సీఎం జగన్‌..!

ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మేము నేరుగా మా ఆనందాన్ని మీతో పంచుకుంటాము, దయచేసి మా ప్రమేయం లేకుండా బయట వస్తున్న వార్తలు పట్టించుకోవద్దు, ఎల్లప్పుడూ మీరు మాపై చూపించే ఆదరాభిమానాలే మాకు శ్రీరామరక్ష కృతజ్ఞతలతో మీ మంచు మనోజ్ అని పేర్కొన్నారు. ఇక మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి భూమా మౌనిక తల్లిదండ్రులైన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి ఘాట్ కు వెళ్లి వారికి నివాళులు అర్పించబోతున్నారు. ఇక భూమా మౌనికకు తన మొదటి భర్త నుంచి ఒక కుమారుడు ఉన్నారు. ఆ బుడతడిని మంచు మనోజ్ తన సొంత కొడుకులా చూసుకుంటూ ఉండడం కొన్ని ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉండడం కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇక భూమా మౌనికను మంచు మనోజ్ కొన్ని నెలల క్రితం నిరాడంబరంగా వివాహం చేసుకున్నాడు.