Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే జోష్ లో వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఈ టైమ్ లో ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు మనోజ్. తాజా ప్రోమోలో.. తన బయోపిక్ గురించి మాట్లాడాడు. నా బయోపిక్ తీయాలంటే సందీప్ రెడ్డి వంగా మాత్రమే తీయగలడు. ఎందుకంటే ది వైల్డెస్ట్ ఎనిమల్ కదా నేను అంటూ చెప్పాడు.
Read Also : Little Hearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ..?
తేజ సజ్జాతో గొడవలు అంటూ వచ్చిన రూమర్లపై కూడా స్పందించాడు. అలా అయితే కౌగిలించుకోను కదా. నేను ఎవరితోనూ గొడవ పడ్డా దూరంగానే ఉంటాను. కౌగిలించుకోవడానికి వచ్చినా అక్కడే ఆపేస్తాను. ఎందుకంటే మనసులో పెట్టుకుంటే నాకు నిద్ర పట్టదు. నేను నాలాగా ఉంటేనే నాకు నచ్చుతుంది. నా భార్య మౌనిక రెడ్డి వచ్చిన తర్వాత లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇంటికి త్వరగా వెళ్తున్నాను. ఆమె పెట్టింది తింటున్నాను. మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది లైఫ్ నేర్పిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. తన పొలిటికల్ ఎంట్రీతో పాటు అనేక విషయాలపై మనోజ్ స్పందించాడు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది.
Read Also : OG : త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్.. పవన్ ఫ్యాన్స్ థాంక్స్
