Manchu Manoj :’దాదా’లో బిజీ.. చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో మంచు మనోజ్ స్పెషల్ పూజలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబానికి సమయం కేటాయించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన షూటింగ్ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకున్న మనోజ్.. భార్య భూమా మౌనిక, పిల్లలతో కలిసి మైసూరులో ప్రత్యక్షమయ్యారు. నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ **’డాడా’** షూటింగ్ ప్రస్తుతం మైసూరులో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మనోజ్ ఒక పవర్-ప్యాక్డ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ సినిమా షూటింగ్ గ్యాప్ దొరకడమే ఆలస్యం.. మనోజ్ తన ఫ్యామిలీని మైసూరుకు రప్పించుకుని, నేరుగా ప్రసిద్ధ చాముండి కొండపైకి వెళ్లారు.
కుటుంబ సమేతంగా కొండెక్కిన మంచు మనోజ్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో మనోజ్, మౌనిక దంపతులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి వేద పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఇక మనోజ్ ఫ్యామిలీ మైసూరు టెంపుల్‌కు వచ్చిందన్న విషయం తెలియగానే, ఆలయ ప్రాంగణంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన హీరోను చూసేందుకు, పలకరించేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. ఏదేమైనా.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ సెంటిమెంట్‌కు మనోజ్ ఇచ్చే ప్రాధాన్యత మరోసారి హాట్ టాపిక్‌గా మారింది!
Also Read
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!