NTV Telugu Site icon

Manchu Manoj: మనోజ్ అన్నా.. మెగా అల్లుడునే దింపావా..?

Sai

Sai

Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. వచ్చే గెస్ట్ లను తనదైన మాటకారి తనం, చలాకీతనంతో మనోజ్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్వహిస్తుండడంతో పెద్ద పెద్ద స్టార్లే ఈ షోకు వస్తున్నారు. నాని తో ఉస్తాద్ స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత సిద్దు జొన్నలగడ్డ, రానా వచ్చి సందడి చేసారు. ఇక ఇప్పుడు మరో గెస్ట్ రాబోతున్నారు అంటూ మేకర్స్ ఒక ఫోటోను రిలీజ్ చేశారు. మనోజ్ ను గట్టిగా హత్తుకున్న సెలబ్రీటి ని చూపిస్తూ.. గెస్ ది హీరో అని పజిల్ పెట్టారు. ఇక ఈ ఫొటోలో మచ్చుకు కూడా ముఖం కనిపించడం లేదు. అయితే అభిమానులు మాత్రం వెనుక హెయిర్ ను బట్టి, ఆ బాడీ లాంగ్వేజ్ ను బట్టి ఆ హీరో మెగా మేనల్లుడు అని చెప్పుకొస్తున్నారు.

మంచు మనోజ్ ఉస్తాద్ షోకు ఈసారి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫొటోలో ఉన్నది కొందరు రవితేజ అని చెప్పుకొస్తున్నారు. రవితేజ నటిస్తున్న ఈగల్ చిత్ర నిర్మాతలు కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే కావడంతో ప్రమోషన్స్ కోసం మాస్ మహారాజానే గెస్ట్ గా వచ్చాడు అని అనుకుంటున్నారు. అయితే బ్యాక్ నుంచి రవితేజలా కనిపించడమా లేదని, రవితేజకు ఫుల్ హెయిర్ ఉంటుందని, మనోజ్ కన్నా హైట్ ఉంటాడని చెప్పుకొస్తున్నారు. తేజ్.. మనోజ్ కు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో.. ఈ ఫొటోలో ఉన్నది తేజ్ అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ గెస్ట్ రవితేజనేనా..? లేదా.. సాయి ధరమ్ తేజ్ నా ? అనేది తెలియాలంటే ప్రోమో రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.