NTV Telugu Site icon

Manchu Manoj: మంచు మనోజ్ గేమ్ షో కు ఫస్ట్ గెస్ట్ ఆ హీరోనే..

Nani

Nani

Manchu Manoj: హీరో మంచు మనోజ్ చాలా గ్యాప్ తరువాత అభిమానుల ముందుకు రాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా పర్సనల్ సమస్యల వలన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన మనోజ్.. భూమా మౌనికను వివాహమాడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇక ఇప్పటికే వాట్ ది ఫిష్ అనే సినిమాతో వెండితెర మీద రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దీంతో పాటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటడానికి సిద్దమైన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో మంచో మనోజ్ హోస్ట్ గా ఉస్తాద్.. ర్యాప్ ఆడిద్దాం అనే షో మొదలుకానుంది. ఇదోక గేమ్ షో.. సెలబ్రిటీలను ఆడించడంతో పాటు వారితో మాట్లాడి.. పర్సనల్ విషయాలను బయటపెడుతూ ఉంటారు. ఈ మధ్యనే ఈ షోకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక మంచు మనోజ్ షో అనగానే మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా ఎవరు వస్తారు అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. అయితే.. మొదటి ఎపిసోడ్ కదా మంచు కుటుంబ సభ్యులు అనగా .. మంచు మోహన్ బాబు కానీ, మంచు లక్ష్మీ కానీ వస్తారేమో అనుకున్నారు. కానీ, టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మనోజ్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. మంచు లక్ష్మీ తో ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా అనుకోలేదని.. భవిష్యత్తులో ఏదైనా ప్లాన్ చేయొచ్చేమో అని చెప్పుకొచ్చాడు. దీంతో మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబ సభ్యులు ఉండరని అర్థమైంది. ఇక తాజాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా ఎవరు వసున్నారో తెలిసిపోయింది. ఆ హీరో ఎవరో కాదు న్యాచురల్ స్టార్ నాని. మనోజ్ ను నాని హాగ్ చేసుకుంటున్న ఫోటోను షేర్ చేసి.. గెస్ ది హీరో అంటూ రాసుకొచ్చారు. వెనుకనుంచి నానిలానే ఉండడంతో హాయ్ నాన్న ప్రమోషన్స్ కోసం వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ షోలో మనోజ్.. నానిని ఎలా ఆడుకుంటాడో చూడాలి.