NTV Telugu Site icon

Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరకే.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్

Manoj

Manoj

Manchu Manoj: మంచు వారబ్బాయి మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబంలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడకుండా ఇమేజ్ ను కాపాడుకుంటున్న హీరో అంటే మనోజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ మధ్యకాలంలో మనోజ్ పేరు గట్టిగా వినిపించింది అని చెప్పొచ్చు. అందుకు కారణం మనోజ్ రెండో పెళ్లి. భూమా మౌనిక ను మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ పెళ్లి తరువాత అన్న విష్ణుతో గొడవ.. సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా మారిందో తెలిసిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. పెళ్లి తరువాత మనోజ్ ఎక్కువగా రాజకీయ ప్రచారాల్లోనే కనిపించదు. భార్య మౌనిక కలిసి.. టీడీపీ ప్రచార సభల్లో సందడి చేశాడు. దీంతో మనోజ్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే మనోజ్ మాత్రం తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదని, తన భార్య ఇస్తే తప్పకుండా సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

Prabhas: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్.. ప్రభాస్ రియాక్షన్ చూశారా .. ?

ఇక ఇప్పటికే మనోజ్ వాట్ ది ఫిష్ అనే సినిమా చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చాలా గ్యాప్ తరువాత మనోజ్ కెమెరా ముందుకు వెళ్ళాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కెమెరాకు దండం పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ” మళ్లీ మా అమ్మ దగ్గరకు.. సినిమా. మీ అందరినీ నా హృదయంతో ప్రేమిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ఇక దీంతో అభిమానులు ఆల్ ది బెస్ట్ మనోజ్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు కమ్ బ్యాక్ గట్టిగా ఇవ్వాలంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో మనోజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.