NTV Telugu Site icon

Manchu Manoj: హౌస్ ఆఫ్ మంచుస్ అంతా ఫేక్.. తేల్చి చెప్పేసిన మంచు మనోజ్

Manoj

Manoj

Manchu Manoj: మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగు పరిచయమయ్యాడు మంచు మనోజ్. దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మనోజ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక మంచి మంచి కథలను ఎంచుకుంటూ మనోజ్ రాకింగ్ స్టార్ గా మారాడు.సినిమాలన్నీ పక్కన పెడితే అభిమానులు.. మనోజ్ వ్యక్తిత్వాన్ని ఎంతో అభిమానించారు. 2018 తర్వాత మనోజ్ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు. అతని వ్యక్తిగత విషయాల వలన సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికి ఈ ఏడాది మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే వాట్ ద ఫిష్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మనోజ్.. తాజాగా బుల్లితెరపై కూడా తన సత్తా చాటడానికి రెడీ అయ్యాడు. ఈటీవీ విన్ ఛానల్లో ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే షోకు హోస్ట్ గా మారాడు. ఇక ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇక అనంతరం జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు మనోజ్ సమాధానం చెప్పుకొచ్చాడు.

మంచు బ్రదర్స్ మధ్య గతంలో గొడవలు జరిగిన విషయం తెల్సిందే. ఇక గొడవకు సంబందించిన వీడియోను మనోజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి.. వెంటనే డిలీట్ చేశాడు. ఇక ఆ తరువాత తమ కుటుంబంలో గొడవలు ఏమి లేవని అదంతా గేమ్ షో అంటూ.. మంచు విష్ణు మరో వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో వచ్చి దాదాపు ఏడాది అవుతుంది. ఇప్పటివరకు దాని గురించిన సమాచారం లేనే లేదు. ఇక అప్పుడే జనాలకు అర్థమైంది.. వారి గొడవలను కప్పిపుచ్చడానికి హౌస్ ఆఫ్ మంచుస్ అనే రియాల్టీ షోను చేస్తున్నట్లు తెలిపారు అని.. ఇక తాజాగా మనోజ్ కూడా ఆ షో ఫేక్ అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. హౌస్ ఆఫ్ మంచుస్ షో ఎక్కడి వరకు వచ్చింది అన్న ప్రశ్నకు.. మనోజ్ మాట్లాడుతూ.. ” ఇప్పుడు ఆ షోకు టైటిల్ మార్చమండీ.. నా అదేంటంటే.. నా చావు నేను చస్తా.. మీ పని చూసుకో అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా.. ఫండింగ్ మీరు పెట్టిన వెంటనే కీస్ ఇచ్చేస్తా అని రిపోర్టర్ తో మాట్లాడడాన్ని బట్టి అలాంటి గేమ్ షో అస్సలు లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.