NTV Telugu Site icon

Manchu Manoj: ‘మా’ వివాదం.. మరోసారి మంట పెట్టిన మంచువారబ్బాయి..

manchu manoj

manchu manoj

టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎంతటి సంచలనాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో చివరికి మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసి మా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఈ పోటీ నడుస్తున్న క్రమంలో మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసింది. ఆ సమయంలో నాగబాబు కొద్దిగా నోరు జారిన విషయం కూడా విదితమే. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం కొద్దిగా సద్దుమణిగిన ఈ గొడవకు మరోసారి ఆజ్యం పోశాడు మంచు మనోజ్. ఇటీవల తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మంచు మనోజ్ మాట్లాడుతూ నాగబాబు పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

” మా ఎలక్షన్స్ జరిగాయి. ఎవరికి వారు మాకు ఓటేయండి అంటే మాకు ఓటేయండి అంటూ ప్రచారం చేశారు. అయితే అప్పటికే జనాలు ఎవరికి ఓటు వెయ్యాలో నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే మా అన్నను మా ప్రెసిడెంట్ గా చేయాలనుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు శత్రువులు ఉండరు. ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు. అయితే ఎలక్షన్స్ సమయంలో ఒక వ్యక్తి మాత్రం మా అన్నను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చాడు. మాకు సపోర్ట్ చేసిన పెద్ద వాళ్లను కూడా అవమానిస్తూ మాట్లాడాడు. దీనిపై మా అన్న పట్టించుకోలేదు.. మా నాన్న వదిలేయమన్నారు. ఎందుకు ఇదంతా నాన్న అని అడిగితే.. అతనికి హయ్యర్ పర్పస్ తెలీదు రా.. వదిలేయ్ అని చెప్పారు. నాకు కూడా నిజమే కదా అనిపించింది. అతని చుట్టూ ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ, అతను మాత్రం అలా కాలేకపోయాడు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే లైఫ్ లో హయ్యర్ పర్పస్ లేకపోతే జీవితం చాలా బ్యాడ్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి” అంటూ ముగించాడు. ప్రస్తుతం మనోజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముగిసిపోయిన వివాదానికి మంచువారబ్బాయి మల్లి రేపడంలో అర్ధం ఏంటి..? ఈ వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Show comments