NTV Telugu Site icon

Manchu manoj: వారికి ఓటు వేయండి అంటున్న హీరో మంచు మనోజ్..!

5

5

తాజాగా చిత్తూరు జిల్లాలో మాట్లాడిన మాటలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగాఆయన మాట్లాడుతూ.. ప్రజలు ‘ పది మందిని కలుపుకుని వెళ్లే లీడర్ ను వెతుక్కోండి, అవగాహనతో కరెక్ట్ లీడర్ ను ఎన్నుకోండి’ అంటూ అన్నారు. నాయకులు వాళ్ల ఫ్యామిలీ, చుట్టుపక్కల వాళ్ళుకు హెల్ఫ్ చేయలేని వాళ్లు మీకేం హెల్ఫ్ చేస్తారు.. ఇలాంటి అంశాలను గుర్తు పెట్టుకుని ఏ లీడర్ వస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి అంటూ తెలిపారు. ఎవరైతే డబ్బులు ఉన్నాయి కదా.. అని ఇస్తే తీసుకోండి. ఆపై మాత్రం మీకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఓటేయండి అని అన్నారు.

మనందరం కలిసి ఉంటేనే దేశానికి బలం. కాకపోతే ఈ మధ్య ఆ ప్రేమ కనిపించడం లేదు. ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతుంది. మనుషులను విభజించి పాలించకూడదు. ఇలా 0ఒంటరిగా విజయం సాధించవచ్చు. కాకపోతే అది సాధించే క్రమంలో మీ వెంట ఉన్న వారిని మర్చిపోకండి అంటూ తెలిపాడు. ప్రతిఒక్కరి ఎదుగుదలలో కొత్త పరిచయాలు వస్తుంటాయి, పోతుంటాయి. అందులో కొత్త పరిచయాలు వచ్చాయని పాత పరిచయాలు వదిలేస్తే.. మనం మనుషులం కాదు మృగాలం., అందుకే తాము గతాన్ని మర్చిపోకూడదు.. పాత స్నేహాన్ని ఎప్పటికి మర్చిపోకూడదు అని పేర్కొన్నాడు.

విభజించి పాలిచడం అనేది ఒక లీడర్ క్వాలిటీ కాదని.. అందరిని కలుపుకుని వెళ్లే వాడే అసలైన లీడరని.. మనిషకి ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం కిందకు దించేస్తాయని., అంతా నాది అనుకుంటే అతనిని “పీస్ ఆఫ్ మైండ్” అంతటితో ఆగిపోతుందని చెబుతూనే.. ప్రజలు ఓటును డబ్బుకు అమ్ముకోకండి.. కాకపోతే, అతను మంచి నాయకుడా.. కాదా.. ప్రజలని విడదీస్తూ వస్తున్నాడా..? లేక కలుపుకుని వస్తున్నాడా..? తప్పులు చేస్తున్నాడా..? లేదా పరిశీలించండి అంటూ వ్యాఖ్యలు చేసారు హీరో మంచు మనోజ్.