NTV Telugu Site icon

Manchu Manoj: ‘హనుమాన్’తో 28 ఏళ్లకే రెండు జనరేషన్స్ కవర్ చేశావ్.. ఇరగ్గొట్టేశావ్ తమ్ముడూ !

Teja Sajja Hanuman

Teja Sajja Hanuman

Manchu Manoj Praises hanuman Movie Team: తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఈ హనుమాన్ సినిమా రూపొందింది. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను వంటి వారి ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా చూసిన దాదాపు అందరూ సినిమా బాగుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ ఈ సినిమా చూసి తన ఆనందాన్ని మీడియా వేదికగా షేర్ చేశారు. ఇంద్ర సినిమాతో నాకు, హనుమాన్ తో మా అబ్బాయి ధైర్యవ్ కి గూజ్ బంప్స్ తెప్పించావు కదా తమ్ముడు తేజ. కిల్లర్ పర్ఫామెన్స్ తో నీ యాక్టింగ్ తో ఇరగ్గొట్టేశావు. 28 ఏళ్ళకి రెండు జనరేషన్స్ ని కవర్ చేశావు. ప్రశాంత్ వర్మ నుంచి ఒక అమేజింగ్ ఫిలిం వచ్చేసింది.

The Goat Life: “ది గోట్ లైఫ్” సెకండ్ పోస్టర్ రిలీజ్ చేసిన రన్వీర్ సింగ్

నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది తమ్ముడు ప్రశాంత్ వర్మ అని పేర్కొంటూ హనుమాన్ సినిమాకి సంబంధించిన క్రూ మొత్తానికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు. ఇక ప్రస్తుతానికి మంచు మనోజ్ షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మరోపక్క సినిమా చూసిన కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా తేజ సజ్జాను కలిసి సినిమా బాగుందంటూ అభినందించడమే కాకుండా సత్కరించడం కూడా జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే సినిమా చూసేందుకు సమంత తన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ తో కలిసి ఏఎంబీ థియేటర్ కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఆమె కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియా షేర్ చేసుకునే అవకాశం ఉంది. సమంత తేజ కలిసి సినిమాలో నటించారు అప్పటినుంచి వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.