NTV Telugu Site icon

Manchu Manoj: తారకరత్న సేఫ్.. పోరాడుతున్నాడు.. వచ్చేస్తాడు

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: నందమూరి తారకరత్న గత మూడురోజులుగా ప్రాణాలతో పోరాడుతున్నాడు. బెంగుళూరు లోని నారాయణ హృదయాలయలో చికిత్స జరుగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే హాస్పిటల్ కు నందమయూరి కుటుంబం చేరుకొని తారకరత్నను పరామర్శిస్తున్నారు. నేడు తారక్, కళ్యాణ్ రామ్ కుటుంబ సమేతంగా బెంగుళూరు చేరుకొని తారకరత్న ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న పోరాడుతున్నాడు అని, ఆయన త్వరగా కోలుకొని బయటికి వస్తారని తారక్ చెప్పాడు. ఇక తాజాగా తారకరత్నను చూడడానికి మంచు మనోజ్ బెంగుళూరుకు వెళ్ళాడు. తారకరత్న, తారక్.. మంచు మనోజ్ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నతనం నుంచి వీరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. ఆ అభిమానంతోనే స్నేహితుడు చావుబతుకుల్లో ఉన్నప్పుడు దైర్యం చెప్పడానికి మనోజ్ నారాయణ హృదయాలయకు వెళ్లి తారకరత్నను చూసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. స్నేహితుడిని ఆ పరిస్థితిలో చూడగానే మనోజ్ కంటతడి పెట్టుకున్నాడు.

ఇక అనంతరం మనోజ్ మీడియా తో మాట్లాడుతూ.. “తారకరత్నను చూడడం జరిగింది.. రికవరీ అవుతున్నాడు. చిన్నప్పటి నుంచి తారకరత్న తెలుసు. నాకు నమ్మకం ఉంది.. త్వరలోనే ఆయన కోలుకొని బయటికి వచ్చేస్తాడు. అతను స్ట్రాంగ్ ఫైటర్.. మళ్లీ వచ్చి.. మళ్లీ యాక్టివ్ గా మారిపోతాడు. మొదటి నుంచి కూడా తారకరత్న చాలా యాక్టివ్. అతను చేసిన ర్యాలీలు, ప్రచారాలు చూస్తూ ఉంటాను. మంచి వ్యక్తి.. ఇంతలోనే అనుకోకుండా ఇలా జరిగింది. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది.. పోతూ ఉంటుంది. అతనికి ఇది టెస్టింగ్ టైమ్.. అతను మళ్లీ తిరిగివస్తాడు.. నేను వందశాతం కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఆ దేవుడి దయవలన త్వరగా కోలుకొని బయటికి రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా దేవుడ్ని ప్రార్ధించండి. వైద్యులతో మాట్లాడాను.. వారుకూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.