Site icon NTV Telugu

Manchu Manoj: నేడు మౌనికారెడ్డితో మంచు మనోజ్ వివాహం…

Manchu Manoj

Manchu Manoj

మంచు మోహన్ బాబు రెండో కొడుకుగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఆ తర్వాత సోలో హీరోగా ఎదిగిన మంచు మనోజ్ తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కడు మిగిలాడు తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత గతేడాది వినాయక చవితి రోజున బయటకి వచ్చిన మంచు మనోజ్, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. దానికి కారణం మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డిలు కలిసి బయటకి రావడమే. ఈ ఇద్దరూ కలిసి బయటకి వచ్చి పూజ చేసినప్పటి నుంచి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే మాట వినిపిస్తూనే ఉంది. ఇన్ని రోజులు ఏ రోజున, ఏ ప్లేస్ లో మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు పెళ్లి చేసుకుంటారు అనే విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే మంచు మనోజ్, మౌనికా రెడ్డిని ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఫిల్మ్ నగర్ లోని సొంత ఇంట్లో, రాత్రి 8:30 నిమిషాలకి మంచు మనోజ్, భూమ మౌనికా రెడ్డిల వివాహం జరగనుంది. మంచు కుటుంబ సభ్యులు, భూమా కుటుంబ సభ్యుల మధ్య మనోజ్, మౌనిక రెడ్డి వివాహం ఘనంగా జరగనుంది. మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ “పెళ్లి కూతురు” అని కోట్ చేశాడు. ఈ ఫోటోలో మౌనికా రెడ్డి, మంచు మనోజ్ కి పర్ఫెక్ట్ జోడి అనిపించేలా ఉంది. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడం మంచు, భూమ కుంటుంబ అభిమానులని సంతోష పరిచే విషయమే.

Read Also: NTR: స్పాట్ లైట్ అవార్డ్ ఎన్టీఆర్ దగ్గరికి వస్తుంది…

Exit mobile version