NTV Telugu Site icon

Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక వుంది

Manchu Manoj

Manchu Manoj

భూమ మౌనిక రెడ్డిని ప్రేమించి మార్చ్ 3న పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. ఫిల్మ్ నగర్ లోని సొంత ఇంట్లో సినీ రాజకీయ, కుటుంబ సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధులకి నివాళులు అర్పించిన మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు నిన్న ఆళ్లగడ్డలో అభిమానులని, టీడీపి కేడర్ ని కలిసారు. ఈ కొత్త జంట ఆళ్లగడ్డ నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు మనోజ్ పెళ్లిని దగ్గరుండి జరిపించిన మంచు లక్ష్మీ కపుల్ కూడా కొత్త జంటతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు మనోజ్, భూమా మౌనికరెడ్డిలు దర్శనం పూర్తి చేసుకోని బయటకి వచ్చిన తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడాడు… “రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక వుంది కానీ మౌనిక రాజకీయాల్లోకి వెళ్తే మద్దత్తు ఇస్తాను. ప్రేమ ఎప్పుడూ గెలవాలి, నా విషయంలో అది నిజమైంది. 12 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాను, 6 సంవత్సరాలు కష్టాలు అనుభవించాను. ఎక్కడ ఆగానో తిరిగి అక్కడ నుంచే మొదలు పెడుతున్నా… త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది” అని చెప్పాడు. ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న మంచు మనోజ్, ఇప్పుడు ‘వాట్ ది ఫిష్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మనోజ్ మధ్యలో ‘అహం బ్రహ్మాస్మీ’ అనే సినిమా అనౌన్స్ చేశాడు కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. మంచు మనోజ్ కంబ్యాక్ కోసం మంచు ఫ్యామిలీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read Also: Venkatesh Maha: సార్ అనే ముందు కాస్త ఆలోచించాలి… ఊరికే అనేయకూడదు

Show comments