NTV Telugu Site icon

Manchu Manoj: అందుకే చంద్రబాబుతో భేటీ అయ్యా.. పొలిటికల్ ఎంట్రీ.. ?

Manoj

Manoj

Manchu Manoj: మంచు వారి కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం ఎవరికి అర్ధం కావడం లేదు. మంచు బ్రదర్స్ మధ్య వైరం ఉంది అని అందరికి తెల్సిందే. కానీ, అదంతా ఉత్తిదే. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా.. ? అని కొట్టిపారేశాడు మంచు మోహన్ బాబు. ఇక ఈ అన్నదమ్ముల మధ్య గొడవలకు కారణం భూమా మౌనిక అని చెప్పుకొస్తున్నారు. ఆమె టీడీపీ నేత కుమార్తె కావడమే. ఎంతో రిస్క్ చేసి.. ఇంట్లో వారందరిని ఒప్పించి మంచు మనోజ్, మౌనికను వివాహమాడాడు. ఇక వివాహం అనంతరం మనోజ్ టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. మనోజ్ పొలిటికల్ ఎంట్రీ త్వరలో ఉండబోతుంది అని వార్తలు వచ్చినా.. మనోజ్ ఇప్పుడే పొలిటికల్ ఎంట్రీ లేదని, సినిమాలే మొదటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మనోజ్ దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ టీడీపీ లో ఈ జంట జాయిన్ అవుతున్నారేమో అని అనుకున్నారు. దీనివలన మంచు బ్రదర్స్ మధ్య గొడవలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే.. మంచు విష్ణు, మోహన్ బాబు వైసీపీ కాగా.. మనోజ్ టీడీపీ. అయితే తాజాగా చంద్రబాబుతో తాము ఎందుకు భేటీ అయ్యాడో మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు.

Manchu Vishnu: మా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం.. అది చేయలేకనేనా.. ?

నేటి ఉదయం చంద్రబాబు ఇంటికి వెళ్లిన మనోజ్ దంపతులను ఆయన సాదరంగా ఆహ్వానించారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. వివాహం అయ్యాక మొదటిసారి ఇంటికి రావడంతో చంద్రబాబు వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఇక భేటీ అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ.. “పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చాము. మా భేటీ లో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు.. రేపు మా బాబు పుట్టినరోజు కావడంతో ఆయన బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము.. పొలిటికల్ ఎంట్రీ పై త్వరలో నిర్ణయం ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక మంచు మౌనిక మాట్లాడుతూ.. ” చంద్రబాబుని గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది.. పెళ్లయిన తర్వాత నుంచి ఆయనను కలవాలని అనుకున్నాం.. ఈరోజు కుదిరింది.. మా బాబుకు ఆయన ఆశీర్వాదాలు కావాలని తీసుకొచ్చామని” తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Show comments