Site icon NTV Telugu

Manchu Manoj: నవ్విస్తున్న ‘వాట్సాప్’ చాట్ స్క్రీన్ షాట్స్

Manchu Manoj

Manchu Manoj

మంచు ఫ్యామిలీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘మంచు మనోజ్’. అతి తక్కువ కాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్న మంచు మనోజ్, ఆ తర్వాత ఫ్లాప్స్ ఫేస్ చేసి కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా చేసిన మంచు మనోజ్, ఈ మూవీ ఫ్లాప్ అయితే తాను సినిమాలు మానేస్తాను అనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఆరేళ్ళు అవుతున్నా ఆ మాటపైనే నిలబడి ఉన్నాడు. మంచు మనోజ్ ఏ రోజుకైనా సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని మంచు ఫ్యామిలీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మనోజ్ మాత్రం తన సినీ ప్రయాణం మళ్లీ మొదలవుతుందా లేదా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు.

ఆ మధ్యలో ఒకసారి ‘అహం బ్రహ్మాస్మీ’ అనే సినిమాని గ్రాండ్ గా మొదలుపెట్టాడు కానీ అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో మంచు మనోజ్ కంబ్యాక్ కోసం మంచు ఫాన్స్ మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది. సినిమాలకి దూరంగా ఉన్న మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ కనిపిస్తూ, ఫాన్స్ కి ఊరటనిస్తుంటాడు. అలానే రీసెంట్ గా సోషల్ మీడియాలో మంచు మనోజ్ చేసిన ఒక ట్వీట్ నవ్వులు పూయిస్తోంది. మంచు మనోజ్, వెన్నెల కిషోర్ చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా పబ్లిక్ లో మాట్లాడుకోవడానికి, పర్సనల్ గా మాట్లాడుకోవడానికి కొంచెం తేడా ఉంటుంది. ఈ తేడాని చెరిపేస్తూ వెన్నెల కిషోర్ తో తన చాటింగ్ ఎలా ఉంటుందో బయట పెట్టేసాడు మంచు మనోజ్. “నీది నాది హైదరాబాద్ లో కలుస్తుంది” అంటూ అటు హిందీ ఇటు తెలుగు కాకుండా మనోజ్, కిషోర్ చాట్ చేసుకోవడం చూసిన వాళ్లు తెగ నవ్వుకుంటున్నారు. మంచు మనోజ్ హైవోల్టేజ్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే వాడు, ఈ చాటింగ్ చూసిన వాళ్లకి ఒకప్పటి మనోజ్ గుర్తొచ్చి ఉంటాడు. మరి మంచు ఫాన్స్ కోసం, తను సొంతగా సంపాదించుకున్న ఫాన్స్ కోసం మంచు మనోజ్ మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలి.

Exit mobile version