NTV Telugu Site icon

Manchu Manoj: విష్ణు గొడవపై స్పందించిన మనోజ్…

Manchu Manoj

Manchu Manoj

మంచు ఫ్యామిలీలో ఎప్పటినుంచో మనోజ్, విష్ణులకి పడట్లేదు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అన్నదమ్ములు దూరం దూరంగా ఉంటున్నారు అని పత్రికా కథనాలు కూడా వచ్చాయి. మంచు మనోజ్, మౌనికా రెడ్డి పెళ్లికి కూడా మంచు విష్ణు ఒక గెస్ట్ లా వచ్చి వెళ్లిపోయాడు. దీంతో విష్ణు, మనోజ్ కి పడట్లేదు అనే వార్త మరింత ఎక్కువగా వినిపించింది. ఈ మాటని నిజం చేస్తూ మంచు విష్ణు, తన మనుషులని కొడుతున్నాడు అంటూ మంచు మనోజ్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసేసాడు. ఈ వీడియోలో మంచు విష్ణు, మంచు మనోజ్ మనిషి అయిన సారధి ఇంట్లో గొడవ చేస్తున్నట్లు క్లియర్ గా ఉండడంతో అందరూ షాక్ అయ్యారు. ఒక ఇంట్లో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి కానీ మంచు మనోజ్ దాన్ని బయట పెట్టడం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ విషయంపై మంచు విష్ణు, మోహన్ బాబులు కాస్త సాఫ్ట్ గానే స్పందించారు. ప్రతి ఇంట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములు చిన్న చిన్న గొడవలు మాములే అని మోహన్ బాబు చెప్పాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్ మాత్రం అస్సలు స్పందించట్లేదు. అసలు ఎలాంటి సంఘటన తనకి, తన అన్నకి మధ్య జరగలేదు అన్నట్లు మంచు మనోజ్ తనపై తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.

ఇటివలే దర్శకుడు బాబీ, టైగర్ నాగేశ్వర రావు డైరెక్టర్ వంశీలతో టైం స్పెండ్ చేసిన మంచు మనోజ్ ఇందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎప్పటిలాగే చాలా క్యాజువల్ గా ఉన్న మంచు మనోజ్, తాజాగా రియల్ స్టార్ శ్రీహరి కొడుకు ‘మేఘాన్ష్’ కొత్త సినిమా ఓపెనింగ్ కి గెస్టుగా వచ్చాడు. ఈ సమయంలో మంచు విష్ణు ఇష్యూ గురించి స్పందిస్తాడు అనుకుంటే మనోజ్ దాన్ని లైట్ తీసుకుంటూ… “కొత్త జీవితాన్ని ప్రారంభించాను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, సినిమాల్లోకి మళ్లీ వస్తున్న మీ అందరి సపోర్ట్ కావాలి” అంటూ మాట్లాడాడు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో అన్నదమ్ములని కలిపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందుకే మంచు మనోజ్, విష్ణు గురించి మాట్లాడట్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

Show comments