NTV Telugu Site icon

Manchu Manoj: పవన్ కే ఓటు వేయండి.. నేను అలా అనలేదు

Manchu Manoj

Manchu Manoj

Manchu Manoj: మంచు కుటుంబంలో మనోజ్ ఒక్కడే.. ఎలాంటి ట్రోల్స్ లేకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక మోహన్ బాబు చిన్న కొడుకుగా తెలుగుతెరకు పరిచయమైన మనోజ్.. మంచి మంచి కథలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక గత కొంతకాలంగా అతని కెరీర్ సరిగ్గా నడవడంలేదని తెల్సిన విషయమే. భూమా మౌనికతో ప్రేమ, పెళ్లి వలన కొంత కెరీర్ కు గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు పెద్దవారిని ఒప్పించి మనోజ్.. మౌనిక మెడలో తాళికట్టాడు. ఇక రాజకీయపరంగా కూడా మనోజ్ తన వాక్చాతుర్యంతో అభిమానులకు సలహాలు ఇస్తూ ఉంటాడు. తాజాగా మనోజ్ చిత్తూరు జిల్లాలో మాట్లాడిన మాటలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఈవెంట్ లో మనోజ్ మాట్లాడుతూ.. ” ప్రజలు పది మందిని కలుపుకుని వెళ్లే లీడర్ ను వెతుక్కోండి, అవగాహనతో కరెక్ట్ లీడర్ ను ఎన్నుకోండి. నాయకులు వాళ్ల ఫ్యామిలీ, చుట్టుపక్కల వాళ్ళుకు హెల్ఫ్ చేయలేని వాళ్లు మీకేం హెల్ఫ్ చేస్తారు.. ఇలాంటి అంశాలను గుర్తు పెట్టుకుని ఏ లీడర్ వస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి. ఎవరైతే డబ్బులు ఉన్నాయి కదా.. అని ఇస్తే తీసుకోండి. ఆపై మాత్రం మీకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఓటేయండి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చాలామంది మనోజ్ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కు ఓటు వేయమని చెప్తున్నాడు అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ వ్యాఖ్యలపై మనోజ్ పోస్ట్ పెట్టాడు. ” ప్రియమైన మిత్రులారా, శ్రేయోభిలాషులు మరియు గౌరవనీయులైన ప్రెస్ సభ్యులు, ఈ సందేశం మీ అందరికి మంచిగా మరియు ఆరోగ్యంతో ఉన్నారని ఆశిస్తున్నాను. నేను ఇటీవల జరిగిన సంఘటనలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నా తండ్రి పుట్టినరోజు వేడుకల రోజు జరిగిన అపార్థాలను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ముందుగా, ఈవెంట్‌లో నా ప్రసంగం చుట్టూ ఉన్న గందరగోళాన్ని నేను పరిష్కరించాలనుకుంటున్నాను. దేశంలో ఐక్యత, గౌరవం, రాజకీయ సరిహద్దులను అధిగమించడమే నా ప్రధాన ఉద్దేశం. దురదృష్టవశాత్తూ లైవ్ స్ట్రీమింగ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం కాలేదు. అందువల్లే తప్పుగా అర్థం చేసుకున‍్నారు. నేను వేదికపై ఉన్నప్పుడే అంతరాయం కలిగింది. అందుకే నా మాటల్లో కొన్ని మాత్రమే ప్రజలకు చేరాయి. ఈ పాక్షిక సమాచారాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు.

నా ప్రసంగం నిర్దిష్ట నాయకుడిని లేదా రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదని నేను ఖచ్చితంగా స్పష్టం చేయాలి. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు నా వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కొనసాగిస్తున్నా. సాంకేతిక లోపాలను గుర్తించి క్షమాపణలు చెప్పినందుకు సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు. సాంకేతిక లోపాలను గుర్తించి క్షమాపణలు చెప్పినందుకు సాంకేతిక బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకు క్లారిటీ కోసం పూర్తి వీడియోను నా ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేస్తున్నాను. ఒక నటుడిగా మీకు వినోదాన్ని అందించడమే నా ముందున్న లక్ష్యం. మీ నిరంతర మద్దతు, అవగాహన మరియు నా కుటుంబం పట్ల మరియు నా పట్ల మీరు చూపిన అపారమైన ప్రేమకు నేను మీ అందరికీ ధన్యవాదాలు. కులం, మతం, మతానికి అతీతమైన వసుధైక కుటుంబం విలువలను మా నాన్న నేర్పించారు. ఒక కుటుంబంగా దానిని మేము విశ్వసిస్తాం. మరోసారి బుల్లితెరపై మీ అందరినీ అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.