NTV Telugu Site icon

Manchu Manoj: తండ్రి కాబోతున్న మనోజ్.. మంచు వారింట సంబరాలు

Bhuma Mounika Reddy Pregnancy

Bhuma Mounika Reddy Pregnancy

Manchu Manoj Announces his wife Bhuma Mounika Reddy Pregnancy: దివంగత భూమా శోభా, నాగిరెడ్డి అలాగే మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారని తన తండ్రి మోహన్ బాబు అమ్మ నిర్మలా దేవి అశీసులతో వెల్లడించారు మంచు మనోజ్. మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన శుభవార్త చెప్పారు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్న మంచు మనోజ్ తన అత్తమ్మ భూమా శోభ పుట్టినరోజు వేళ ఆమెను గుర్తుచేసుకుంటూ ఈ శుభవార్త చెబుతున్నానని పేర్కొన్నారు. తన అత్తమ్మ శోభా నాగిరెడ్డి, మావయ్య భూమా నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారని అలాగే అన్నయ్యగా తనకు ప్రమోషన్ వస్తున్నందుకు భూమా మౌనికా రెడ్డి కుమారుడు ధైరవ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పారు.

Bigg Boss Telugu 7: ఇది నిజంగా ఉల్టా ఫుల్టానే.. శివాజీకి మూడోస్థానం.. ఫైనలిస్టులుగా ప్రశాంత్, అమర్.?

తన అత్తమ్మ, మామయ్య ఎక్కడున్నా తమను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని తన తల్లి నిర్మల, తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని మంచు మనోజ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పలువురు మనోజ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలకు దూరమైన మనోజ్ 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని 2019లో విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఇది రెండే పెళ్లే. మనోజ్‌ పెళ్లి సమయానికే మౌనికకు ఓ కొడుకు కూడా ఉన్నా ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా మరో చిన్నారి వీరి లైఫ్ లోకి రాబోతున్నాడు.