NTV Telugu Site icon

Manchu Lakshmi : స్టార్ కిడ్… అయినా బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్‌ తప్పలేదు !

Manchu-lakshmi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా టాలీవుడ్‌లోని పవర్ లేడీస్ లో ఒకరైన లక్ష్మి మంచు ఇండస్ట్రీలో తాను కాస్టింగ్ కౌచ్‌, బాడీ షేమింగ్ ఎదుర్కోవడం గురించి మాట్లాడింది. సీనియర్ నటుడు, టాలీవుడ్ లోని టాప్ నటులలో ఒకరైన మోహన్ బాబు కుమార్తె అయినప్పటికీ కాస్టింగ్ కౌచ్ వంటి దురదృష్టకర పరిస్థితులను తాను ఎదుర్కోవలసి వచ్చిందని లక్ష్మి చెప్పుకొచ్చింది.

Read Also : Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్‌ కు స్పెషల్ థ్యాంక్స్

ఆమె ఇప్పటివరకు తన కెరీర్‌లో సెక్సిజం, కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఒక న్యూస్ పోర్టల్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది సాధారణ సమస్య అని, అమ్మాయిలు అన్ని దశలు, వృత్తులలో ఎదుర్కోవాల్సిన విషయం అని లక్ష్మి మంచు అన్నారు. “ఐటీ, బ్యాంకింగ్, ఫిల్మ్స్ ఇలా ప్రతిచోటా ఇలాంటి అఘాయిత్యాలను ఎదుర్కొనే వివిధ రంగాలకు చెందిన చాలా మంది మహిళలు నాకు తెలుసు. నేను కూడా దీన్ని ఎదుర్కొన్నాను. మొదట్లో తన తండ్రి స్టార్ కాబట్టి అలాంటిదేమీ జరగదని గట్టి నమ్మకంతో ఉన్నాను. కానీ ఎవరూ ఎక్కడా న్యాయంగా, దయగా ఉండరు” అని చెప్పుకొచ్చింది.

ఇక తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి లక్ష్మి మాట్లాడుతూ “బాడీ షేమింగ్ దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా మానవులను ప్రభావితం చేసింది. ఇది రోజురోజుకు పెరుగుతోంది. లావుగా ఉన్నప్పుడు లావుగా ఉన్నవని అన్నారు. సన్నబడితే సన్నగా ఉన్నావు అంటున్నారు. అందరూ అందరినీ సంతోషపెట్టలేరు. మీ గురించి మీరు బతకాలి. ఇది మొదట్లో నాపై ప్రభావం చూపించింది” అని లక్ష్మి చెప్పింది.

Show comments