Manchu Lakshmi: మంచు కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్ద గా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విధంగా వారు ట్రోల్ అవుతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ ట్రోల్ అవ్వడానికి కంటెంట్ ను ఇచ్చేది కూడా వారే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మంచు విష్ణు, మంచు లక్ష్మీ ట్విట్టర్ లో ఏ ట్వీట్ చేసినా అది నిమిషాల్లో వైరల్ గా మారిపోవడం, ఆ తరువాత దానిమీద పెద్ద చర్చ.. విమర్శలు.. అబ్బో మాములుగా ఉండవు. ఇక ఇన్ని ట్రోల్స్ వచ్చినా వారు అలాంటి ట్వీట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా మంచు లక్ష్మీ చేసిన ఒక ట్వీట్ నెట్టింట సిరలు గా మారింది. కంటెంట్ ఏది లేకుండా “దీని అమ్మ జీవితం” అంటూ హ్యాష్ ట్యాగ్ లా పెట్టుకొచ్చింది.
Mytri Movie Mekars: మరో ‘వార్’ కన్ఫామ్ రా.. ఫిక్స్ చేసేసుకోండి
ఇక దీంతో మరోసారి నెటిజన్స్ మంచక్కను ఆడేసుకుంటున్నారు. ఏంటక్కా ఆ మాటలు అని కొందరు.. నిత్యం డబ్బుతో ఉంటున్నావ్ నీకే జీవితం మీద ఇంత విరక్తి వస్తుంటే.. పేదవారి పరిస్థితి గురించి ఏం చెప్పుకోవాలి అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొందరు అయితే.. ఏ.. ఇది అక్క కొత్త సినిమా పేరేమోలే అని కామెంట్స్ పెడుతుండగా.. ఇంకా అల్లరి నెటిజన్స్.. అక్కా.. నీ ఇంగ్లిష్ భాషలో ఈ పదాన్ని ఎలా పలుకుతావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు మంచు లక్ష్మీ ఎందుకు ఆ పదాన్ని వాడింది. ఆమె ఎలాంటి బాధలో ఉంది అనేది మాత్రం తెలియదు. మరి దానికేమైనా మంచక్క క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 31, 2023
