NTV Telugu Site icon

Manchu Lakshmi: డబ్బు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మీ

Manchu

Manchu

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, నిర్మాతగా ఆమె ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం తండ్రి మోహన్ బాబుతో కలిసి అగ్ని నక్షత్రం అనే సినిమా తీస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక లక్ష్మీ సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చే ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ.. ట్రోలింగ్ అవుతూ ఉంటుంది. మొన్నటికి మొన్న సైమా అవార్డ్స్ లో కెమెరాకు అడ్డు వచ్చాడని ఒక వ్యక్తిని కొట్టిన వీడియో వైరల్ గా మారింది. ఇక తాజాగా ఆమె ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ లోని బిజినెస్ క్లాస్ లో ఉన్న కార్పెట్స్ చాలా చెత్తగా, మురికిగా ఉన్నాయని, క్లీన్ గా లేవని .. తన ఐఫోన్ లో వీడియో తీయడం వలన అవి కొద్దిగా అలా కనిపిస్తున్నాయని.. బయట చూడడానికి ఇంకా మురికిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోపై ఓకే నెటిజన్ ..సరే అక్క నువ్వు బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నావ్.. అది చెప్పడానికే కదా ఈ వీడియో అని వెటకారంగా కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్ పై మంచు లక్ష్మీ ఫైర్ అయ్యింది.

” నేను నిన్న ఎయిర్ ఇండియా గురించి ఒక ట్వీట్ చేశాను. కార్పెట్ బాగోలేదని, ఐఫోన్ లో చిత్రీకరించడంతో కొంచెం బెటర్ గా కనిపిస్తుందని చెప్పాను. ఇక దడదడ కామెంట్స్ వచ్చేసాయి.. ఓ నువ్వు బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నావేమో.. ఓ నీకు ఐఫోన్ ఉందేమో .. నువ్వు కొన్నిచ్చావా.. ? నాకు టికెట్ కు డబ్బులిచ్చావా.. ? నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు. నీకేంటి రా నొప్పి.. నువ్వేదో డబ్బులు ఇస్తున్నట్లు. నువ్వు నాకేం చెప్తున్నట్లు ఉందంటే .. నేను ఎంజాయ్ చేయడం బ్యాడ్ అన్నట్లు ఉంది. నాకేం ఉండకూడదా.. నేను పెద్ద పెద్ద కలలు కనకూడదా.. ? అన్ని తప్పులే.. నువ్వేదో నాకు డబ్బులు కట్టినట్లు. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను అంటే.. ఒక మహిళ.. తాను ఏది చేసినా చూపించకూడదు…. చెప్పకూడదు నేను చాలా కష్టపడతా.. డబ్బు కోసం. మా నాన్న, అమ్మ ఎవరు నాకు డబ్బులు ఇవ్వరు. నేను ఉంటున్న లైఫ్ మొత్తం నా కష్టార్జితం. ఇంట్లోనే ఉండు.. అంట్లు తోము .. పిల్లల్నే చూసుకో.. నీకో కెరీర్ ఉండకూడదు ఇలాంటివన్నీ తప్పు. నువ్వు కుక్ కావాలనుకుంటున్నావా.. అవ్వు .. డ్రైవర్ అవుతావా అవ్వు.. ప్రైవేట్ ఫ్లైట్ కొనాలకుంటున్నావా కొను.. ఇదంతా సాధారణమైన లగ్జరీ.

డబ్బు ఉండడంతోనే హ్యాపీనెస్ వస్తుంది అంటే అది నేను నమ్మను. నేను నా జీవితంలో చాలా డబ్బు చూసాను. మీరు సిల్వర్ స్పూన్.. గోల్డెన్ స్పూన్ తో పుట్టి పెరిగారేమో .. నేను డైమండ్ స్పూన్ తో పుట్టిపెరిగాను. కానీ అమెరికాలో ఫుడ్ కూడా లేని పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఆనందాన్ని ఇచ్చేది డబ్బు కాదు. డబ్బు ఏం ఇస్తుందో తెలుసా .. ఫ్రీడమ్ ఇస్తుంది. డబ్బు హ్యాపీ నెస్ అని, స్టేటస్ అని, ఫేమ్ అని, నేమ్ అని .. ఇవన్నీ పక్కన పెడితే.. డబ్బు ఫ్రీడమ్ ఇస్తుంది. ఏది కావాలంటే అది చేసే ఫ్రీడమ్ ను ఇస్తుంది. వంట చేయడం తప్పు కాదు.. ఇల్లు చూసుకోవడం తప్పు కాదు.. పిల్లల్ని పెంచడం తప్పు కాదు.. కానీ, అవే చేయమనడం తప్పు. జీవితంలో తప్పు తప్పు అనకుండా .. మనది మనది అనుకోండి.. జీవితం చాలా చిన్నది. ఎప్పుడు పోతుందో తెలియదు.. ఎవరి కోసం బ్రతకాలి.. నీకోసం కాకపోతే.. ఇంకెవరి కోసం బ్రతికే బ్రతుకు.. ఒక బ్రతుకా.. వాళ్ళు మీ బిల్స్ కడుతున్నారా.. ? డబ్బులు ఏమైనా ఇస్తున్నారా.. ? వేరే వాళ్ల అభిప్రాయాలను వింటూ బతకకండి ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments