Site icon NTV Telugu

Manchu Lakshmi : కన్నప్పలో నేను నటిస్తే మిగతా వాళ్లు కనిపించరు.. మంచు లక్ష్మీ సెటైర్లు

Manchu Lakshmi

Manchu Lakshmi

Manchu Lakshmi : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ టైమ్ లో మంచు లక్ష్మీ ఈ మూవీలో ఎందుకు నటించలేదంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వాటిపై ఆమె స్పందించింది. నేను ఈ మూవీలో నటిస్తే మిగతా ఎవరూ నటించరు అని సరదాగా సెటైర్లు వేసింది. ఈ మూవీలో నాకు సరిపోయే పాత్ర లేదేమో.. అందుకే నాకు విష్ణు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చేవాడేమో. ఆ విషయం మీరు విష్ణును అడగాలి.

Read Also : Sreenu Vaitla : సినిమా డబ్బులతో భూములు కొన్నా.. శ్రీనువైట్ల కామెంట్స్..

కన్నప్ప మూవీలో నేను నటించి ఉంటే అది ఒక ఫ్యామిలీ అని అంతా అనుకునేవారు. ఇప్పటికే మా ఫ్యామిలీ చాలా సినిమాల్లో కలిసి నటించింది. నాకు ఛాన్స్ ఇవ్వనంత మాత్రాన నా తమ్ముడికి నా సపోర్ట్ లేదని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. సినిమాలో నటించలేనంత మాత్రాన మా మధ్య ఏదో ఉందని కాదు. నా సపోర్ట్ నా తమ్ముడికి ఎప్పుడూ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ. ఆమె ఈ నడుమ సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. అప్పట్లో వరుస సినిమాలు చేసింది. అడపాదడపా మొన్నటి దాకా చేసినా.. గత ఏడాదిన్నరగా ఆమె నుంచి ఎలాంటి మూవీలు రావట్లేదు. రీసెంట్ గా ఓ లెస్బియన్ సినిమాలో కనిపించింది.

Read Also : Rajamouli : జక్కన్న మొదలెడితే.. స్టార్ హీరోలు ఫాలో అవుతున్నారే..

Exit mobile version