Site icon NTV Telugu

Manchu Lakshmi: స్వలింగ సంపర్కుల వివాహంపై సుప్రీం తీర్పు.. గుండె పగిలిపోయింది, దేశానికి ఇది నిజమైన అవమానం!

Manchu Lakshmi

Manchu Lakshmi

Manchu Lakshmi on Same Sex Marriage: స్వలింగ సంపర్కులు చేసుకునే పెళ్లిళ్లకి చట్ట బద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. వాటికి స్పెషల్ మ్యారేజీ యాక్ట్ కింద లీగల్‌‌గా గుర్తింపును ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలకు సంబంధించిన చట్టాన్ని మార్చే అంశం పార్లమెంట్ పరిధిలో ఉందని వెల్లడించింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌‌కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై మంగళవారం నాడు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే స్వలింగ సంపర్కులకు సమాజంలో ఎలాంటి వివక్ష ఎదురుకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడింది. స్వలింగ జంటలు తమ పెళ్ళిళ్ళను రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా క్లెయిమ్ చేయరాదని తీర్పు ఇచ్చింది.

Yukti Thareja: బ్లాక్ డ్రెస్సులో కాక రేపుతున్న యుక్తి తరేజా

ఇక ఈ బెంచ్ ఇచ్చిన కీలక తీర్పుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం వ్యక్తం చేయగా ఈ తీర్పు విషయంపై ఆర్ఎస్ఎస్, ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా ఈ హింద్ కూడా స్వాగతించాయి. అయితే ఎల్‌‌జీబీటీక్యూఐఏ++ కమ్యూనిటీ, యాక్టివిస్టులు, పిటిషనర్ల నుంచి మాత్రం ఈ తీర్పు మీద భిన్న స్పందన లభించింది. సుప్రీం ప్రస్తావించిన పాజిటివ్ అంశాలపై కొందరు హర్షం వ్యక్తం చేయగా.. చట్టబద్ధత కల్పించలేమని చెప్పడంపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపించాయి. అయితే టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఈ వ్యవహారం మీద తాజాగా స్పందించారు. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తీర్పుపై నేను చాలా నిరాశతో రాస్తున్నప్పుడు నా గుండె పగిలిపోయింది అని ఆమె పేర్కొన్నారు అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజమైన అవమానం అని పేర్కొన్న ఆమె ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పిన స్వంత దేశంలో దీనిని తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు.

Exit mobile version