NTV Telugu Site icon

Manchu Lakshmi: ఆమెకు దూరంగా ఉండలేకపోతున్నా.. కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మీ

Lakshmi Manchu

Lakshmi Manchu

Manchu Lakshmi: సాధారణంగా ఏ తల్లి కూతుళ్ళ మధ్య అన్న అనుభందం దృఢంగానే ఉంటుంది. మొట్ట మొదటిసారి కూతురు అడుగులు వేసినప్పుడు, అమ్మా అని పిలిచినప్పుడు, మొదటిసారి స్కూల్ కు వెళ్ళినప్పుడు ఆ తల్లి పడే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ ఆనందభాష్పాలను వర్ణించడం ఎవరితరం కాదు. తాజాగా ఒక తల్లిగా మంచు లక్ష్మీ అదే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లు స్కూల్ కు దూరమైనా కూతురు మొదటిసారి స్కూల్ కు వెళ్తుండగా ఆమె ఎమోషనల్ అయ్యింది. ఈ విషయాన్నీ ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకొంటూ కన్నీరు పెట్టుకొంది. విద్యా నిర్వాణ.. మంచు లక్ష్మీ గారాల పట్టి.. ఈ చిన్నారి గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచాయం చేయాల్సిన అవసరం లేదు. విద్యా చదువులోనే కాదు.. అన్నింటిలోనూ దిట్టే. కరోనా సమయంలో అమ్మ లక్ష్మీ తో కలిసి యూట్యూబ్ వీడియోలో నటించి మెప్పించింది. మంచు ఫ్యామిలీ కి విద్యా అంటే మహా ఇష్టం. ఇక ఈ కరోనా కారణంగా అందరూ ఇంట్లో ఉండడంతో లక్ష్మీ కి, విద్యాకు మధ్య ఎక్కువ అనుబంధం ఏర్పడింది.

ఇక కరోనా సెలవులు ముగిసి నేడు విద్యా స్కూల్ కు వెళ్ళింది. ఇక ఈ విషయాన్నీ మంచు లక్ష్మీ చెప్తూ “కరోనా లాక్ డౌన్ సమయంలో స్కూల్స్ క్లోజ్ చేసినప్పుడు భయం వేసింది. ఇంట్లో విద్యాను ఎలా భరించాలి..? ఆమె అల్లరిని తట్టుకోవడం కష్టంతో కూడుకున్న పని అని అనిపించింది. కానీ ఈ రెండుళ్లు విద్యా నాతోపాటు నన్ను అంటిపెట్టుకొని ఉంది.. ఇప్పుడు కరోనా తరువాత మొదటిసారి తను స్కూల్ కు వెళ్తుంటే ఏదో తెలియని బాధ.. ఆమెకు దూరంగా ఉండలేకపోతున్నా.. కానీ ఉండాలి. తను బావుంది.. నేను కూడా బావున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. తల్లి మనసు అలాగే ఉంటుంది.. అని కొందరు అంటుండగా.. స్కూల్ కే గా వెళ్ళింది.. సాయంత్రం వచ్చేస్తుందిగా.. దానికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments