NTV Telugu Site icon

Manchu Lakshmi: గడ్డ కట్టే చలిలో బికినీ వేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్

Manchu Lakshmi Monokini Video

Manchu Lakshmi Monokini Video

Manchu Lakshmi Bikini Video Goes Viral: టాలీవుడ్‌లో మంచు లక్ష్మి గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమె అనుకున్న క్రేజ్ దక్కలేదు. నిజానికి ఒకప్పుడు యాంకర్ గా కూడా మంచు లక్ష్మి ప్రయత్నాలు చేసింది. యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయి మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు కూడా చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది.

Operation Valentine : ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ఫస్ట్ స్ట్రైక్ రిలీజ్ టైం ఫిక్స్..

సినిమాలతో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌ గానే ఉంటోంది, ఇక ఇప్పుడు విదేశాల్లో వేకేషన్‌లో ఉన్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో ఆమె మోనోకినిలో కనిపించగా అది బికినీ అనుకుని అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ వీడియోలో ఆమె గడ్డకట్టే చల్లని నీటిలో మునుగుతూ కనిపించింది. ఆ వీడియోలో సన్నింగ్‌ లుక్‌లో అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చింది మంచు లక్ష్మీ. గతంలో రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్ వంటి వారు కూడా ఇలా మంచు నీటిలో మునిగి తేలారు. ఇక ఈ టాలీవుడ్ భామ ఇలా మునిగి తేలడం క్రియో థెరపీ కోసమేనంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం మంచులక్ష్మి ఫిన్‌లాండ్‌ వెకేషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.