యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ‘సోసోగా ఉన్నా’ పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎక్కేసిందే…’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ మిరియాల ఈ పాట పాడారు. అనూప్ రూబెన్స్ ట్యూన్ అందించారు. ఈ పాటకు చక్కని స్పందన లభిస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు.
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ మూవీ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ ఎస్.కె.ఎన్. నిర్మిస్తున్నారు. ‘టాక్సీవాలా’ తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ ఎస్.కె.ఎన్. అంటేనే సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రాబోతోంది. ‘ఏక్ మినీ కథ’ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.