అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Mega157 : చిరు – అనిల్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్.. అదిరిందిగా
నేడు మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా కొద్ది సేపటి క్రితం ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్ పండగకి వస్తున్నారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాతో వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని ఊరిస్తూ వచ్చారు మేకర్స్. కానీ తాజాగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో జస్ట్ చిరు నడుస్తూ సిగరెట్ తాగడం తప్ప మరిఇంకేం చూపించలేదు. మేకర్స్ చెప్పిన దానికి ఎక్కువ ఊహించినదానికి కాస్త నిరుత్సహపరిచారని ఫ్యాన్స్ కొంచం డిజప్పోయింట్ అయ్యారు. కనీసం చిరు డైలాగ్ అయినా ఒకటి పెట్టి ఉంటే బాగుండు అనే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కానీ చిరు వింటేజ్ లుక్స్ ఫ్యాన్స్ హ్యాపి ఫీల్ అయ్యాలా చేసింది. ఇక గ్లిమ్స్ కు భీమ్స్ అందించిన బాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు. అనిల్ రావిపూడి టేకింగ్ కు చిరు వాకింగ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా అనిపించింది. ఈ సారి పండక్కి మాత్రం మన శంకరవరప్రసాద్ గారు సెన్సేషన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
