జ్యోతి, ప్రియ, ప్రశాంత్ నిర్మాతలుగా మదిన్ సంగీత సారథ్యంలో శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో మానస్ నాగులపల్లి, విష్ణు ప్రియ నర్తించిన ‘జరీ జరీ పంచె కట్టు’ ఫోక్ సాంగ్ కు చక్కటి ఆదరణ లభిస్తోంది. నివ్రితి వైబ్స్ ఈ పాటను విడుదల చేసింది. ఇటీవల ఓ ప్రత్యేక కార్యక్రమంలో రఘు కుంచె, సుద్దాల అశోక్ తేజ, శేఖర్ మాస్టర్, సాకేత్, రమణా చారి, ప్రసన్నకుమార్ అతిథులుగా ఈ పాటను విడుదల చేశారు. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ ‘జరీ జరీ పంచె కట్టు’ పాటను సాకేత్ పాడారు. అశోక్ తేజ్ గారితో లిరిక్స్ రాయించుకొని, శేఖర్ మాస్టర్ డేట్స్ దొరకక పోయినా ఆయన కోరియోగ్రఫీ లోనే ఈ పాట చెయ్యాలని పట్టు బట్టి చేసిన నివ్రితి వైబ్స్ వారికి మానస్ కృతజ్ఞతలు తెలిపాడు.
మూవీ సాంగ్ అనుకునేలా నిర్మాతలు ఖర్చుకు వెనుకా డకుండా రిచ్ గా తెరకెక్కించారని అన్నారాయన. మానస్ ను అందరూ హి విల్ బి స్టార్ అంటున్నారని తనకు తెలిసి మానస్ ఆల్రెడీ స్టార్ అంటూ ఈ పాటలో తను చేసిన డాన్స్ అదిరిపోయిందని ప్రశంసించాడు. మరి ఈ పాటకు ఇంకా ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి.
