NTV Telugu Site icon

Manam: మళ్ళీ మెస్మరైజ్ చేస్తోన్న మనం.. వైరల్ అవుతున్న వీడియోలు

Manam

Manam

Manam Rerelease: లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనం’.  మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్‌ మూవీ గా నిలిచింది. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ‘మనం’ స్పెషల్ షోలని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఇప్పటికే షోలు పడ్డాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలసి తెరపై కనిపించడం ప్రేక్షకుల మనసులో చేరగని ముద్ర వేసింది.

Also Read; Devara : రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న దేవర ‘ఫియర్ సాంగ్ ‘..

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన ఆల్బమ్ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులని మరోసారి మెస్మరైజ్ చేస్తోంది. ప్రేమ పాటలకు అనూప్ పెట్టింది పేరు. మనం వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా అనూప్ కీ బోర్డు మీద వాయించిన ట్యూన్స్ మళ్లీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాయి. ఇక అనూప్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న చిత్రానికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. అంతే కాక సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, సక్సెస్ ఫుల్ కాంబో అయిన ఆది సాయి కుమార్‌తో కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమాకు, విజయ్ కొండ ఆకాష్ పూరి కాంబోలో వస్తున్న సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.