మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయింది. చిరంజీవిని అత్యంత స్టైలిష్‌గా చూపిస్తూ అనిల్ రావిపూడి కట్ చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే.. సినిమాపై అంచనాలు పెంచడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ అభిమానుల్లో జోష్ నింపింది.
Also Read : Anaganaga Oka Raju : గ్రాండ్ గా ‘అనగనగా ఒక రాజు’తో ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇందులో మెగాస్టార్‌తో కలిసి విక్టరీ వెంకటేష్ స్టెప్పులేయడం థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంది. అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్‌లో మంచి సక్సెస్ రేట్ ఉండటం, దానికి మెగాస్టార్ క్రేజ్ తోడవ్వడంతో ఈ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు.. అమెరికాలో 15 రోజుల ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అలాగే.. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రెండు పెద్ద ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏపిలో వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి 12న సినిమా రిలీజ్ కానుండగా.. జనవరి 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈవెంట్ విషయంలో మేకర్స్ సైడ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
