Mana Kulapodu sathvik anand got lengthy role in baby Movie: ఒకప్పుడు సినిమాల్లో నటీనటులు లేదా ఇద్దరు టెక్నీషియన్లుగా రాణించాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. ఎంత టాలెంట్ ఉన్నా నటీనటులుగా మారాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు నిజంగా టాలెంట్ ఉన్నవారు సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ బయట పెడుతున్నారు. అనూహ్యంగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో సాత్విక్ ఆనంద్ ఒకడు. ఈ పేరు చెబితే చాలామంది గుర్తుపట్ట లేకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో మన కులపోడు అంటూ వీడియోలు చేసే కుర్రాడు అంటే ఈజీగా గుర్తుపడతారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో కుల వివక్ష ఉందో లేదో చెప్పలేం కానీ కొన్నాళ్ల క్రితం గ్రామాల్లో ఉన్న కుల వివక్షను ఇప్పుడు కళ్లకు కట్టినట్లు చూపిస్తూ వారు ఆసక్తికరమైన వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు సాత్విక్ ఆనంద్.
Deverakonda Brothers: దేవరకొండలిద్దరికీ “బేబీ” బాగా కలిసొచ్చిందే!
మన కులపోడు అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరూ గుర్తుపట్టే విధంగా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న అతను ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల్లో మెరిసాడు. అయితే ఆసక్తికరంగా బేబీ సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో మెరిసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. సినిమా మొత్తం మీద హర్ష చెముడుతో పాటు సాత్విక్ ఆనంద్ కూడా చాలా సీన్లలోనే కనపడ్డాడు. తెర మీద సాత్విక్ ఆనంద్ ను చూసినప్పుడల్లా ప్రేక్షకులు అందరూ అప్రయత్నంగానే నవ్వుకున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతే కాదండోయ్ సాత్విక్ ఆనంద్ చేత ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఒక వ్యక్తి చేసి బాగా వైరల్ అయిన మిమిక్రీ కూడా చేయించాడు దర్శకుడు సాయి రాజేష్. ఏంటి కామెడీనా? ఏంటి దొబ్బేస్తున్నారా ? ఏంటి దాదా గిరీనా? అనే డైలాగులు చెప్పించి ఒక్కసారిగా అందరి దృష్టి పడేలా చేశాడు.