Site icon NTV Telugu

Sreeleela : దారుణం.. శ్రీలీలను అక్కడ పట్టుకుని లాగిన ఆకతాయిలు..

Sreeleela

Sreeleela

Sreeleela : స్టార్ హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ఆకతాయిలు లాగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. శ్రీలీల ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. అక్కడ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ లవ్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక తాజాగా డార్జిలింగ్ లో షూటింగ్ కోసం మూవీ టీమ్ అక్కడకు వెళ్లింది. అక్కడ ఓ చోట షూటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తుండగా.. వారిని చూసేందుకు అభిమానులు వచ్చారు. వారి మధ్యలో నుంచి కార్తీక్ అభివాదం చేసుకుంటూ వస్తున్నారు.

Read Also : Gujarat: ఫ్రెండ్‌కి లిఫ్ట్ ఇవ్వడంపై మందలించిన తల్లి.. 16 ఏళ్ల బాలిక సూసైడ్..

ఆయన వెనకాలే శ్రీలీల కూడా ఫ్యాన్స్ కు హాయ్ చెప్పుకుంటూ వస్తోంది. ఇంతలో ఓ ఆకతాయి ఆమె చేతిని పట్టుకుని లాగేశాడు. దీంతో శ్రీలీల ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ గుంపులోకి ఆమెను లాగే ప్రయత్నం చేశారు. ఇంతలోనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను విడిపించి సేఫ్‌ గా అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనతో శ్రీలీల ఒకింత ఆందోళకు గురైనట్టు ఆమె ఫేస్ ను చూస్తేనే అర్థం అవుతోంది. హీరోయిన్లకు గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. జనాల మధ్యలోకి వెళ్లినప్పుడు ఇలాంటి ఆకతాయిల విషయంలో సేఫ్ గా ఉండాలని ఆమె ఫ్యాన్స్ సూచిస్తున్నారు. శ్రీలీలకు పుష్ప-2లో ఐటెం సాంగ్ తర్వాత మళ్లీ ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

 

Exit mobile version