NTV Telugu Site icon

Bramayugam: మమ్ముట్టి ‘భ్రమ యుగం’ అప్పుడే అవగొట్టారు!

Bramayugam Movie

Bramayugam Movie

Bramayugam Shoot Wrapped: తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న ‘భ్రమయుగం’ షూట్ విజయవంతంగా పూర్తయిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ ప్రకటించింది. ‘భ్రమయుగం’ సినిమా షూట్ ఆగస్టు 17, 2023 మొదలై ఒట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి ప్రాంతాల్లో భారీ స్థాయిలో జరుపుకుంది. ఇక ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ రంగంలోకి దిగింది. ఇక నైట్ షిఫ్ట్ స్టూడియోస్ త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించనుంది. ‘భ్రమయుగం’ నుంచి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లుక్‌తో కూడిన పోస్టర్ విడుదలైనప్పటి నుండి, అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bhagavanth kesari: ‘భగవంత్ కేసరి’లో రతిక… ఏ పాత్రలో నటించిందో తెలుసా?

ఇటీవల విడుదలైన ‘కన్నూర్ స్క్వాడ్’తో సహా వరుస విజయాలతో దూసుకుపోతున్న మమ్ముట్టి, ‘భ్రమయుగం’తో ఆ విజయ పరంపరను కొనసాగిస్తారని అభిమానులు భావిస్తున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రచన-దర్శకత్వంలో రూపొందుతున్న ‘భ్రమయుగం’ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ‘భ్రమయుగం’ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఛాయాగ్రాహకుడిగా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్‌గా జోతిష్ శంకర్, ఎడిటర్‌గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టి.డి. రామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం అయింది.